న్యూస్ 21 తెలుగు ఛానల్: బద్వేల్ నియోజకవర్గం లో రెవెన్యూ సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం ముందుందని బద్వేలు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితిష్ రెడ్డి పేర్కొన్నారు. వైయస్సార్ కడప జిల్లా. బి కోడూరు మండలంలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని బద్వేల్ ఆర్డీవో చంద్రమోహన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బద్వేల్ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ రితీష్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన 272 అర్జీలను స్వీకరించి పలు సమస్యలను సత్వరమే పరిష్కరించే విధంగా కృషి చేశామన్నారు. అనంతరం ఇంచార్జ్ రితీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.గత ప్రభుత్వంలో బటన్ నొక్కాం సంక్షేమం చేస్తున్నామని డబ్బా కొట్టుకున్నారే తప్ప ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు ఎప్పుడైనా తెలుసుకున్నారా అని ఆయన విమర్శించారు.
తమ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రజల వద్దకే పాలన అంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. పాసు పుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకొని ప్రజల భూములను తాకట్టు పెట్టుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకపోయి ఉంటే పేదల భూములను దోచుకునే వాడని ఆయన అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు వాటిని రద్దుచేసి ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారన్నారు. గత పాలకులు ఎప్పుడు భూ కబ్జాలు ఏ విధంగా అక్రమంగా సంపాదించుకోవాలని అంశాలపై దృష్టి పెట్టారు తప్ప ప్రజల అభివృద్ధి కోసం ఎన్నడైనా ఆలోచించారా అని ఆయన ప్రశ్నించారు. 20 నెలల పాలనలో 80 శాతం భూ సమస్యలు పరిష్కరించడంలో మేము ముందున్నామన్నారు.
డి ఆర్ సి మీటింగ్ నిర్వహిస్తే రెవెన్యూ వ్యవస్థలో బద్వేల్ నియోజకవర్గం ముందంజలో ఉందన్నారు. భూ కబ్జాలు ఎక్కడ జరిగిన ప్రభుత్వ భూములను కాపాడుతున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో ప్రజలకు పెన్షన్ ద్వారా నాలుగు వేల రూపాయలు అందిస్తున్నామన్నారు. ప్రజలు కూడా వీటన్నిటిని గమనించాలని ఆయన కోరారు. తల్లికి వందనం ద్వారా ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ లబ్ధి చేకూర్చామన్నారు. సంక్షేమ పథకాలే కాకుండా గ్రామీణ ప్రాంతా అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు నారా లోకేష్ నిరంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం ఇతర దేశాలకు వెళ్లి పెట్టుబడుల కోసం ఎంతో కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ ఐదు సంవత్సరాల పాలనలో నియోజకవర్గ అభివృద్ధితోపాటు సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యం అన్నారు. అనంతరం మండలంలో నూతనంగా నిర్మిస్తున్న స్మార్ట్ కిచెన్ పరిశీలించారు.
ఈ స్మార్ట్ కిచెన్ వల్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని వేగవంతంగా అందించడం రాష్ట్ర ప్రభుత్వ యొక్క ప్రధాన లక్ష్యమన్నారు. ప్రస్తుతం విద్యార్థులకు భోజనం చేస్తున్న వంట ఏజెన్సీలను తొలగించమని ఇందులోనే భాగస్వాములను చేసి ముందుకు తీసుకువెళ్తామన్నారు. మన జిల్లాలో విద్యార్థులకు అందిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని ఒకసారి ఫుడ్ కమిషన్ చైర్మన్ తింటే తెలుస్తుందని ఆయన విమర్శించారు. మన ఇంటి రుచికన్న అద్భుతంగా విద్యార్థులకు భోజనాలను అందిస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ చంద్రమోహన్. ఎమ్మార్వో దస్తగిరయ్య. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోషన్న. ఎంఈఓ సునీల్.టిడిపి మండల అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, సొసైటీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి.అమర్నాథ్ రెడ్డి.బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు రామ సుబ్బారెడ్డి, అన్ని శాఖల అధికారులు.టిడిపి నాయకులు. కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
0 Comments