google.com,pub-7984519998562318,DIRECT,f08c47fec0942fa0 బద్వేల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్.

బద్వేల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్.

న్యూస్ 21 తెలుగు ఛానల్: బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్ ను శనివారం వైయస్సార్ కడప జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ చుట్టుపక్కల పాత పోలీస్ క్వార్టర్స్ ను  ఆయన పరిశీలించారు.అనంతరం పోలీస్ స్టేషన్ కు సంబంధించిన రికార్డును పరిశీలించారు. స్టేషన్ స్టాప్ లో ఏమైనా సమస్యలు ఉన్నాయా. అంటూ ఆయన పోలీస్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అర్బన్ పోలీస్ స్టేషన్ లో సిబ్బంది కొరత ను ఉందని తెలుసుకున్నారు. ఈ మేరకు సిబ్బంది కొరతను పరిష్కరిస్తామన్నారు.
అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వివిధ సమస్యల మీద స్టేషన్ కు వచ్చే బాధితుల తో  ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందని
అసంఘటిత కార్యక్రమాలు నిర్వహించే వారిపై డ్రోన్స్ ద్వారా డేగ కన్ను వేసి అసంఘటిత కార్యక్రమాలను అడ్డుకట్టవేస్తామని ఆయన తెలిపారు.

Post a Comment

0 Comments