google.com, pub-7984519998562318, DIRECT, f08c47fec0942fa0 పోరుమామిళ్లలో ఘనంగా బద్వేల్ టిడిపి ఇంచార్జి రితీష్ రెడ్డి జన్మదిన వేడుకలు...

పోరుమామిళ్లలో ఘనంగా బద్వేల్ టిడిపి ఇంచార్జి రితీష్ రెడ్డి జన్మదిన వేడుకలు...

వైయస్సార్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం లోని తెలుగుదేశం పార్టీ బద్వేల్ ఇంచార్జి రితీష్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని పోరుమామిళ్ల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రంగసముద్రం ఎంపీటీసీ కల్వకురి రమణ ఆధ్వర్యంలో స్వామికి 101 టెంకాయలు కొట్టిన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్న.టిడిపి మండల అధ్యక్షులు భైరవ ప్రసాద్, ఆర్ అండ్ బి రోడ్డు రాష్ట్ర చైర్మన్ సాధనకారి రంతు. పోరుమామిళ్ల మేజర్ సర్పంచ్ యనమల సుధాకర్, బద్వేల్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చెరుకూరి చెన్న రాయుడు, రంగసముద్రం మాజీ సర్పంచ్ నడిపి వెంకటసుబ్బయ్య, సీతా వెంకటసుబ్బయ్య, మరియు కార్యకర్తలు. అభిమానులు. ప్రజలు బద్వేల్ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి రితీష్ రెడ్డి జన్మదిన సందర్భంగా పోరుమామిళ్ల పట్టణంలో  ర్యాలీ నిర్వహించారు.
అనంతరం 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బెడ్లు, పండ్లు  పంపిణీ చేశారు. భారీ కేకు కట్ చేసిన రితీష్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. కేక్ ను తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు. అభిమానులకు. ప్రజలకు పంచిపెట్టారు. అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడంతోపాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్ల, కాశి నాయన, కలసపాడు, బి. కోడూరు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీకాంత్, పాపయ్య, కరిముల్లా, నాయబ్, కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Post a Comment

0 Comments