గ్రామసభ గ్రామ పాలనకు పునాది అని. గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా గ్రామసభ నిలుస్తుందని, గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం పెరగాలంటే గ్రామసభలు చురుకుగా నిర్వహించాల్సిందేనని పోరుమామిళ్ల మండల అధ్యక్షుడు శీలంశెట్టి లక్ష్మయ్య పేర్కొన్నారు. గురువారం గల్ఫ్ దేశం నుండి టుడే జర్నలిస్ట్ ప్రతి నిధితో ఆయన మాట్లాడారు. గ్రామసభ అంటే కేవలం ఒక అధికారిక సమావేశం కాదని, అది ప్రజల స్వరం నేరుగా పాలనకు చేరే వేదిక అని ఆయన స్పష్టం చేశారు.రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామసభలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు “పాలన గ్రామం నుంచే ప్రారంభం కావాలన్నదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టమైన ఆలోచన. ప్రజల సమస్యలు నేరుగా గ్రామసభలోనే వినిపించి, అక్కడే పరిష్కార దిశగా చర్చ జరగాలని ఆయన పదే పదే చెబుతూ ఉంటారని ఆయన అన్నారు.
గ్రామపంచాయతీ పరిధిలో నివసించే ప్రతి అర్హులుగా ఉన్న ఓటరు నేరుగా పాల్గొని తమ సమస్యలు, అభిప్రాయాలు వెల్లడించే అత్యున్నత ప్రజా వేదికే గ్రామసభ అని ఆయన తెలిపారు. గ్రామసభలో ప్రజలు ప్రశ్నించినప్పుడు అధికారులు సమాధానం చెప్పాలని. అది ప్రజాస్వామ్యం పద్ధతిని.ఈ ఆలోచనకు పవన్ కళ్యాణ్ పాలనా దృక్పథం పూర్తిగా అనుగుణంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామసభలను సంవత్సరంలో కనీసం నాలుగు సార్లు నిర్వహించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. గణతంత్ర దినోత్సవం, కార్మిక దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం, గాంధీ జయంతి రోజుల్లో గ్రామసభలు తప్పనిసరిగా జరగాలని చెప్పారు. కానీ గ్రామసభలు కాగితాలకే పరిమితం కాకుండా, నిజమైన చర్చకు వేదిక కావాలన్నదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయం” అని ఆయన స్పష్టం నట్లు చేసినట్లు ఆయన అన్నారు.గ్రామసభకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఓటరు సభ్యుడేనని, ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కు ఉంటుందని ఆయన తెలిపారు. సర్పంచ్ అధ్యక్షతన జరిగే గ్రామసభల్లో ప్రజల మాటలకు ప్రాధాన్యం ఇవ్వాలని, అధికారులు బాధ్యతతో స్పందించాలని అన్నారు. “ప్రజలతో నేరుగా మాట్లాడే పాలన రావాలన్నదే పవన్ కళ్యాణ్ రాజకీయ లక్ష్యం” అని ఆయన వ్యాఖ్యానించారు.గ్రామసభల్లో త్రాగునీరు, పారిశుధ్యం, వీధిదీపాలు, రోడ్లు, డ్రైనేజీ, ఉపాధి హామీ పథకం, పింఛన్లు, రేషన్, గృహ పథకాలు వంటి అంశాలపై చర్చ జరగాలని తెలిపారు. అలాగే గ్రామపంచాయతీ ఆదాయం–వ్యయాల వివరాలు ప్రజలకు స్పష్టంగా చెప్పవలసిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజాధనం ఎలా ఖర్చవుతుందో ప్రజలకే తెలియాలన్న ఆలోచన కూడా పవన్ కళ్యాణ్ పాలనా విధానంలో కీలకం” అని ఆయనఅన్నారు.ప్రత్యేక తేదీల్లో జరిగే గ్రామసభల్లో నిర్ధిష్ట అంశాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జనవరి 26న అభివృద్ధి ప్రణాళికలు, మే 1న ఉపాధి పనులు, ఆగస్టు 15న సంక్షేమ పథకాల సమీక్ష, అక్టోబర్ 2న పారిశుధ్యం, సామాజిక తనిఖీ అంశాలపై చర్చ జరగాలని వివరించారు. “ఇలాంటి వ్యవస్థాత్మక గ్రామసభల ద్వారానే బలమైన గ్రామ పాలన సాధ్యమవుతుంది” అని అన్నారు. గ్రామసభ ప్రజల చేతుల్లో పాలనను ఉంచే శక్తివంతమైన వేదిక అని ఆయన అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పేలా, ప్రజలు మాట్లాడితే పాలన మారుతుందని, గ్రామసభలు సజీవంగా మారితే గ్రామాల భవిష్యత్తు కూడా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు
0 Comments