వైయస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలో 4 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సోమవారం కస్టోడియన్ సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నాలుగు కేంద్రాల్లో 1148 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్ష నిర్వహణ మొత్తం సీసీ పర్యవేక్షణలో జరుగుతుందన్నారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు పలు సూచనలు ఇచ్చామన్నారు. విద్యార్థులు మొబైల్, స్మార్ట్ వాచ్ వంటివి తీసుకురాకూడదని ఆయన సూచించారు.
0 Comments