google.com,pub-7984519998562318,DIRECT,f08c47fec0942fa0 రైతులు అధైర్య పడవద్దు ప్రతి ఒక్కరికి యూరియా అందిస్తాం... బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి...

రైతులు అధైర్య పడవద్దు ప్రతి ఒక్కరికి యూరియా అందిస్తాం... బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి...

న్యూస్ 21 తెలుగు ఛానల్: కాశి నాయన మండలంలోని రైతులకు కావాల్సినంత యూరియా అందుబాటులో ఉందని. రైతులు అధైర్య పడవలసిన అవసరం లేదని. బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ ప్రతి రైతు సేవా కేంద్రానికి యూరియా అందుతుందని ప్రతి ఒక్క రైతుకు సరిపడా యూరియా అందించే విధంగా కృషి చేస్తున్నామన్నారు. కావున రైతులు అధైర్య పడవలసిన అవసరం లేదన్నారు. రంపాడు రైతు సేవ కేంద్రం వద్ద రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారనే విషయం మా దృష్టికి వచ్చిందన్నారు.రంపాడు రైతు సేవా కేంద్రం లో 350 బస్తాల యూరియా అందుబాటులో ఉందన్నారు. బుధవారం 350 బస్తాలు వస్తాయని తెలిపారు. మండలానికి కావాల్సిన అంత యూరియా అందుబాటులో ఉందన్నారు. రైతులు అధైర్య పడవలసిన అవసరం లేదన్నారు.రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు గట్టి చర్యలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. కావున ఈ అవకాశాన్ని మండలంలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆయన తోపాటు కాశినాయన మండల టిడిపి నాయకుడు పోలిరెడ్డి ఉన్నారు.

Post a Comment

0 Comments