న్యూస్ 21 తెలుగు ఛానల్: బద్వేల్ లో తెలుగు యువ అధ్యక్షులు . షేక్ జాంగిర్ భాష మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు పై .వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత, అసభ్య వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. ఒకప్పుడు మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి స్థాయిని పూర్తిగా మరిచి, సభ్య సమాజం తలదించుకునేలా ఆయన మాట్లాడారని రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి ని బూతులు తిట్టడం అత్యంత దిగజారుడు రాజకీయానికి నిదర్శనం అన్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శలకు స్థానం ఉన్నా, అవి సంస్కారబద్ధంగా, గౌరవప్రదంగా ఉండాలని. వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలం ప్రజా జీవితంలో ఉన్న నాయకులకు ఏమాత్రం తగదన్నారు. ఇటువంటి వ్యాఖ్యలతో అంబటి రాంబాబు తన రాజకీయ అవగాహన స్థాయిని, సంస్కార రాహిత్యాన్ని ప్రజల ముందు మరోసారి బయటపెట్టుకున్నారు.రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం కేవలం రాజకీయ దౌర్భాగ్యమే కాకుండా, ప్రజల మనోభావాలను దెబ్బతీసే చర్య అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ ఇటువంటి నీచ వ్యాఖ్యలను ఖండించాలని. అంబటి రాంబాబు వెంటనే తన వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా.తెలుగు తమ్ముళ్లు బుద్ధి చెప్పాల్సిన అవసరం వస్తుందని ఆయన డిమాండ్ చేశారు.
0 Comments