google.com,pub-7984519998562318,DIRECT,f08c47fec0942fa0 నిజమైన నాయకత్వానికి ప్రతీక పవన్ కళ్యాణ్. ఓటర్ల నిజమైన నాయకుడిని గుర్తించాలి. జనసేన పార్టీ నాయకులు శీలంశెట్టి లక్ష్మయ్య.

నిజమైన నాయకత్వానికి ప్రతీక పవన్ కళ్యాణ్. ఓటర్ల నిజమైన నాయకుడిని గుర్తించాలి. జనసేన పార్టీ నాయకులు శీలంశెట్టి లక్ష్మయ్య.

న్యూస్21తెలుగుఛానల్:ప్రస్తుతరాజకీయాల్లోదోచుకుందామా..దాచుకుందామా అన్న ఉద్దేశంతో పాలన సాగుతున్న సమయంలో, ప్రజల సమస్యలపై వెంటనే స్పందిస్తూ న్యాయం చేస్తున్న నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రమేనని లక్ష్మయ్య అన్నారు.
గత ఎన్నికల్లో ఓటమి ఎదురైనా రాజకీయాల నుంచి తప్పుకోకుండా 2024 ఎన్నికల్లో నిలబడి గెలిచి ప్రజలకు న్యాయం చేస్తున్నారని కొనియాడారు. ఒక వ్యక్తికి న్యాయం చేస్తూ ముందుకు సాగుతున్న నిజాయితీగల నాయకుడు పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు.
నెల్లూరు జిల్లాలో స్కూల్ పిల్లలు (మాకు రోడ్లు వేయండి సారు )అన్న వీడియో పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లగానే తక్షణమే స్పందించి రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకున్నారని తెలిపారు. ప్రతి నాయకుడు ఇదే విధంగా ప్రజా సమస్యలపై స్పందిస్తే, రాష్ట్రంలో గుంతలతో నిండిన రహదారులు మాయమవుతాయని అన్నారు.
కావున ఓటర్లు ఇప్పటికైనా గ్రహించి నిజమైన నాయకుడిని గుర్తించి మద్దతు ఇవ్వాలని కోరారు. రాష్ట్రమంతా జనసేన వైపు చూస్తోందని, రాబోయే రోజుల్లో పేద ప్రజలకు జనసేన పార్టీ అండగా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Post a Comment

0 Comments