న్యూస్ 21 తెలుగు ఛానల్: వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల మండలం లోని కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలలో డాక్టర్ శ్రీవిద్య ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినిలకు నులిపురుగులకు సంబంధించిన ఆల్బండ్ జోల్ మాత్రలను అందించి తినిపించారు.ఈ సందర్భంగా డాక్టర్ శ్రీవిద్య విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఫిబ్రవరి.మరియు ఆగస్టు నెలల్లో తప్పనిసరిగా ఆల్బండ్ జోల్ మాత్రలు మింగి కడుపులోని నులిపురుగులను నివారించుకోవాలని ఆమె సూచించారు. నులిపురుగులు పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపి రక్తహీనత. పోషకాహార లోపం మరియు చదువుపై ప్రభావం కలిగిస్తాయని ఆమె తెలిపారు. 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలు అందరూ తప్పనిసరిగా ఈ మాత్రలు తీసుకోవాలని, ఎవరైనా తీసుకొని ఎడల ఈ నెల 24వ తేదీన నిర్వహించే మాప్-అప్ డే రోజున తీసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీవిద్య. హెచ్ ఈ ఓ సరస్వతి. ఎం ఎల్ హెచ్ పి ప్రియాంక. ఏఎన్ఎం విజయ్ కుమారి. ఆశ కార్యకర్త విజయ.కళాశాల విద్యార్థినిలు. ఉపాధ్యాయురాలు పాల్గొన్నారు.
0 Comments