న్యూస్ 21 తెలుగు ఛానల్: వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల మండలం పట్టణం లోని జడ్పీ హైస్కూల్లో డాక్టర్ జయరాం ఆధ్వర్యంలో జాతీయ నులి పురుగుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జయరాం విద్యార్థులకు నులిపురుగులకు సంబంధించిన ఆల్బండ జోల్ మాత్రలను అందించి తినిపించారు. అనంతరం డాక్టర్ జయరాం మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఫిబ్రవరి మరియు ఆగస్టు నెలల్లో తప్పనిసరిగా నులి పురుగులకు సంబంధించిన ఆల్బండ్ జోల్ మాత్రలు మింగి కడుపులోని నులిపురుగులను నివారించుకోవాలని ఆయన సూచించారు. నులిపురుగులు పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపి రక్తహీనత. పోషకాహార లోపం మరియు చదువుపై ప్రభావం కలిగిస్తాయని ఆయన అన్నారు.డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సాదు వెంకటేశ్వర్లు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులందరూ తప్పనిసరిగా ఈ నులిపురుగుల మాత్రలు తీసుకోవాలన్నారు. ఎవరైనా తీసుకోకపోతే ఈ నెల 24వ తేదీన నిర్వహించే మాప్-అప్ డే రోజున తీసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఓబయ్య. సిహెచ్.భార్గవి. ఏఎన్ఎం రేష్మ. మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు
0 Comments