న్యూస్ 21 తెలుగు ఛానల్: కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ వితంతు, వృద్ధాప్య పింఛన్ల విషయంలో నిర్లక్ష్యం కొనసాగుతోందని బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్ల మండల జనసేన పార్టీ అధ్యక్షులు శీలంశెట్టి లక్ష్మయ్య ఆరోపించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.భర్తను కోల్పోయిన మహిళలు పిల్లలతో జీవనం గడపడం కష్టంగా మారిందని, కుటుంబ అవసరాలు ఎన్నో ఉన్నప్పటికీ ప్రభుత్వం పింఛన్లు విడుదల చేయకపోవడం బాధాకరమన్నారు. వృద్ధులకు కూడా పింఛన్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
బాధితులు ప్రభుత్వమిచ్చిన హామీలను గుర్తు చేస్తూ “అప్పుడు ఇచ్చిన హామీలు ఏమైపోయాయి.మాకు న్యాయం చేయండి” అంటూ అప్పుడప్పుడు అధికారులను ప్రశ్నిస్తున్నారని తెలిపారు.ప్రభుత్వం తక్షణమే స్పందించి అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పింఛన్లు విడుదల చేసి న్యాయం చేయాలని జనసేన పార్టీ తరఫున ఆయన డిమాండ్ చేశారు.
0 Comments