google.com,pub-7984519998562318,DIRECT,f08c47fec0942fa0 కాంగ్రెస్ పార్టీ యూత్ నేతల అరెస్ట్ దారుణం...

కాంగ్రెస్ పార్టీ యూత్ నేతల అరెస్ట్ దారుణం...

కాంగ్రెస్ పార్టీ యూత్ రాష్ట్ర అధికార ప్రతినిధి అన్వర్...

న్యూస్ 21 తెలుగు ఛానల్: ఆట ఆడ లేక మద్దెల దరువు చేస్తున్న చందంగా కేంద్ర ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఉందని, ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ వద్ద  ప్రపంచ దేశాల ముందు భారత్ ప్రతిష్టను దిగజారుస్తున్న మోడీ వ్యవహార శైలికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలిపిన యూత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను. మరియు యూత్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఉదయ్ భాను చిబ్ ను అరెస్టు చేయడం చాలా దారుణమని. ఈ చర్యను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని యూత్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అన్వర్ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచ వేదికగా ఏఐ సమ్మిట్ ను నిర్వహిస్తున్నటువంటి తరుణంలో గల్గోటియాస్ యూనివర్సిటీ చైనా రోబోను తామే తయారు చేశామని చెప్పి దేశం పరువు తీసినటువంటి ఘోరమైన అవమానం, ప్రతి విషయంలోనూ అమెరికా వద్ద భారతదేశాన్ని తాకట్టు పెడుతూ ప్రతి చిన్న విషయానికి కాంప్రమైజ్ అయిన నరేంద్ర మోడీ వ్యవహార శైలికి వ్యతిరేకంగా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన శాంతియుత నిరసన సమంజసమైనదే అని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ పరువు తీస్తు ప్రతి విషయంలో అమెరికా ముందు తలవంచుతున్న నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రపంచ దేశాల ముందు భారత్ పరువును తీస్తున్న కేంద్ర ప్రభుత్వం యూత్ కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే దీనికి భారతీయ జనతా పార్టీ, మోడీ ప్రభుత్వం అవాకులు చవాకులు పేల్చడం దొంగే దొంగ అన్నట్లుగా ఉందని దానికి తోడు బిజెపి యువ మోర్చా నాయకులు ఆంధ్రప్రదేశ్ లో అనేకచోట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపై దాడి చేసి ఫ్లెక్సీలను చించడం పనికిమాలిన చర్య అని ఆయన మండిపడుతూ అరెస్ట్ చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Post a Comment

0 Comments