కేవలం పింఛన్లు పంపిణీ చేసేందుకే సచివాలయాలు...
కాంగ్రెస్ పార్టీ పోరుమామిళ్ల మండల అధ్యక్షులు అన్వర్ మండిపాటు...
న్యూస్ 21 తెలుగు ఛానల్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన సచివాలయాలు. రెవిన్యూ మరియు గ్రామ పంచాయతీ వ్యవస్థకు ఆరోవ వేలుగా ఉండి అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని కాంగ్రెస్ పార్టీ పోరుమామిళ్ల మండల అధ్యక్షులు అన్వర్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2009 రెండవసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రెవెన్యూ పాలనను సులభతరం చేసే దిశగా "మీ_సేవ" ఏర్పాటు చేసి దాని ద్వారా నామమాత్ర రుసుముతో రెవెన్యూ శాఖకు సంబంధించి ప్రతి పత్రాన్ని సులభంగా పొందే విధంగా ఏర్పాటు చేసి మీ_సేవ కార్యకలాపాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. అప్పటినుంచి 2019 వరకు మీ_సేవ ప్రజలకు సేవలు అందిస్తూ వచ్చింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సచివాలయాలు ఏర్పాటు చేసి రకరకాల పేర్లతో దాదాపు 14 కొత్త ఉద్యోగాలను సృష్టించి మరల 50 ఇండ్లకు ఒక వాలంటీరుని ఏర్పాటు చేసి వీరందరితో మీ_సేవ ద్వారా ఒకరు చేసే పనిని 20 మందితో చేపిస్తూ. ప్రజాధనాన్ని అనవసరంగా ఖర్చు చేసిందని ఆయన దుయ్యబట్టారు. మరలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాలంటీర్ లను తొలగించి సచివాలయ ఉద్యోగులతో కేవలం పెన్షన్లు మాత్రమే పంపిణీ చేపిస్తూ.దొందు దొందే అన్న విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు తప్ప.సచివాలయ ఉద్యోగులతో ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన మండిపడ్డారు. సచివాలయ ఉద్యోగులు సచివాలయాలకు ఎప్పుడు పోయినా ఉండరని కనీసం సమయపాలన పాటించరు. ఎప్పుడు సచివాలయాలకు ప్రజలు వెళ్లిన.వారు లేరు_ వీరు లేరు ఆ అసిస్టెంట్ లేరు, వీఆర్వో లేరు ఇలా వారు వీరు లేరని చెబుతూనే ప్రజలను ఇబ్బంది పెడుతు.పదిసార్లు సచివాలయాలు చుట్టూ తిప్పిస్తూ కనీసం పెన్షన్లు కూడా సరిగా పంపిణీ చేయకుండా కొంతమంది ఉద్యోగులు సచివాలయాల వద్దకే పెన్షన్ దారులను కూడా పిలిపించుకుంటూ అధికారం చలాయిస్తున్నారు తప్ప వారితో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడైనా పెన్షన్లకు ఒక్కటే కాకుండా వారి ద్వారా అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు అవసరం అయ్యే విధంగా విధులు కేటాయించి ప్రజలకు జవాబుదారీతనంగా ఉండేటట్లు ఆదేశాలను జారీ చేయాలన్నారు.ఒకరు చేసే పనిని దాదాపు పది మందితో చేపిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు.
0 Comments