నా రాజకీయ ఎదుగుదలను చూడలేక నాపై బురద చల్లుతున్నారు...
వెంగమాంబ విద్యాలయం చైర్మన్ గుర్రం పుల్లపునాయుడు...
న్యూస్ 21 తెలుగు ఛానల్: ప్రభుత్వ భూమిని నేను ఆక్రమించలేదని. ప్రభుత్వం మంజూరు చేసిన అన్ని ఆధారాలతో పత్రాలు ఉన్నాయని. నా రాజకీయ ఎదుగుదలను చూడలేక నాపై బురద చల్లుతున్నారని. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి చేసిన ఆరోపణలు వాస్తవము కాదని. అవి ఆ వాస్తవం అని వెంగమాంబ విద్యాలయం చైర్మన్ గుర్రం పుల్లపు నాయుడు తీవ్రంగా ఖండించారు.
వైయస్సార్ కడపజిల్లా. పోరుమామిళ్ల మండలంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి నాయకులు చాపాటి లక్ష్మి నారాయణరెడ్డి చేసిన కబ్జాలను కప్పిపుచ్చుకునేందుకు మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. నేను కోట్ల విలువ చేసే భూమిని ఆక్రమించామని నిరూపిస్తే దేనికైనా సిద్ధమే అని సవాలు విసిరారు. వేల మంది విద్యార్థులకు విద్యాదానం చేస్తున్నం తప్ప కబ్జా చేయవలసిన అవసరం మాకు లేదన్నారు. రెవెన్యూ అధికారులు విచారణ చేసి ఎలాంటి కబ్జా చేయలేదని నివేదిక ఇచ్చారన్నారు. రాజకీయంగా తనపై బురద చల్లాలనే ఉద్దేశంతో కొందరు వ్యక్తులు కుమ్మకై తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
చాపాటి నారాయణరెడ్డి అనే వ్యక్తి బ్రహ్మంగారిమఠం, కాశినాయన మండలం, పోరుమామిళ్ల తదితర మండలాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించి కోట్ల రూపాయల సొమ్ము చేసుకున్నాడని వారు ఆరోపించారు. పోరుమామిళ్ల రంగసముద్రం చెరువు ఆక్రమించి స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. నీతి నిజాయితీగా తమ పెద్దల నుండి వచ్చిన ఆస్తిని ఆక్రమించామనడం దుర్మార్గమన్నారు. మాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న నారాయణరెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తాము అక్రమంగా భూమిని ఆక్రమించామంటే ఆధారాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించి పరువు నష్టం దావా వేస్తామన్నారు.చాపాటి లక్ష్మీ నారాయణ రెడ్డి మాపై చేసిన ఆరోపణలన్నీ అసత్యాలని ఆయన అన్నారు. అతను చేసిన ఆరోపణలు రుజువు చేస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉంటామని సవాల్ విసిరారు.ఈ మధ్య కాలం లో అతనిపై వచ్చిన ఆరోపణలను, కబ్జాలను కప్పి పుచ్చుకోవడానికి ఆయన కబ్జా చేసిన భూములకు ఆధారాలు చూపించలేక మాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు.ఇవన్నీ ఆయన చేసిన తప్పిదాలు. ఆయన పేరున 50 ఎకరాల వరకు బినామీ పేర్లు సృష్టించి అతని తప్పులను కప్పి పుచ్చుకోవడానికి ఈవిధమైన దారుణ ప్రవర్తన కనబరుస్తున్నాడని ఆయన అన్నారు.
0 Comments