google.com,pub-7984519998562318,DIRECT,f08c47fec0942fa0 ఉద్యోగ ఉపాధ్యాయులకు వెంటనే పిఆర్...సిడిఎ...ఐఆర్ లను ప్రకటించాలి...

ఉద్యోగ ఉపాధ్యాయులకు వెంటనే పిఆర్...సిడిఎ...ఐఆర్ లను ప్రకటించాలి...

పోరుమామిళ్ల తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన ఉపాధ్యాయుల బృందం...

న్యూస్ 21 తెలుగు: వైఎస్ఆర్ కడప జిల్లా. పోరుమామిళ్ల మండల రీజియన్ పరిధిలో ఏ పి టి ఎఫ్ ఆధ్వర్యంలో వివిధ మండలాలలో ని ఉపాధ్యాయుల సమస్యల పై పామ్లెట్స్ ఆవిష్కరణ లో భాగంగా ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో పోరుమామిళ్ల మెయిన్ జడ్పీ హైస్కూల్. గిరినగర్ ఎంపీ యు స్కూల్. కాశినాయన మండలంలోని నరసాపురం జడ్పీ హైస్కూల్. టేకూరుపేట జడ్పీ హైస్కూల్ నందు పాంప్లెట్ ఆవిష్కరణ చేశారు. అనంతరం
పోరుమామిళ్ల తహశీల్దార్ కార్యాలయం ఎదుట పలు సమస్యల పై ఉపాధ్యాయుల బృందం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో  ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు. మరియు జిల్లా నాయకులు మాట్లాడుతూ ఉద్యోగులకు సీపీస్ రద్దు చేసి అందరికి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. చాలా సంవత్సరాల నుండి పని చేసే కాట్రాక్ట్ ఉద్యోగులు కస్తూర్బ.మోడల్ స్కూల్. సి ఆర్ ఎం టి ల జీతాలు పెంచాలన్నారు. రెగ్యులర్ కూడా చేయాలని. ఉద్యోగులకు రావలసిన బకాయిలు. పిఆర్సి. ఐఆర్ ఇవ్వకపోతే భవిష్యత్ లో ఢిల్లీ లో ధర్నా చేయవలసి వస్తుందని. వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సురేంద్రనాథ్ రెడ్డి.భాస్కర్ రెడ్డి. ఎస్ ఏ సత్తార్.రామకృష్ణా రెడ్డి.జాఫర్.సుదీర్. గౌడ్.సుబ్బయ్య.రామమోహనరెడ్డి.బాలయ్య. గురయ్య.క్రిష్ణారెడ్డి.సీతారామిరెడ్డి.శేషారెడ్డి. భూపాల్ రెడ్డి.సి కె శ్రీనివాసులురెడ్డి.ఎస్ మస్తాన్.నరసింహారెడ్డి. ఎస్ యాసిన్.జానకిరెడ్డి. గోపాలరెడ్డి.మస్తాన్ వల్లి పాల్గొన్నారు.

Post a Comment

0 Comments