google.com,pub-7984519998562318,DIRECT,f08c47fec0942fa0 కొండ ఫోరంబోకు ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వెంగమాంబ విద్యాలయ యాజమాన్యం...

కొండ ఫోరంబోకు ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వెంగమాంబ విద్యాలయ యాజమాన్యం...

ప్రభుత్వ డీకేటి స్థలం లో నిర్మించిన వెంగమాంబ విద్యాలయం...

 కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని బయట వ్యక్తులకు విక్రయాలు...

కోట్ల రూపాయలు వెనకేసుకున్న వెంగమాంబ విద్యాలయం యాజమాన్యం...

కొండ పోరంబోకు స్థలంలో నిర్మించిన ఈ ఆలయం విద్యాలయం...

విద్యాలయానికి అనుమతి ఇచ్చిన విద్యాశాఖ అధికారులు...

పట్టించుకోని రెవెన్యూ అధికారులు...

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి చాపాటి. లక్ష్మి నారాయణ రెడ్డి...

వైయస్సార్ కడప జిల్లా బ్యూరో- టుడే జర్నలిస్ట్ ప్రతినిధి: వైయస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని రంగసముద్రం గ్రామ రెవెన్యూ  పొలం సర్వేనెంబర్ 1261/2 లో ప్రభుత్వ కొండ ఫోరంబోకు స్థలాన్ని ఆక్రమించి వెంగమాంబ విద్యాలయం నిర్మించారని. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన తహసిల్దార్ కార్యాలయం ఎదుట మీడియాతో మాట్లాడుతూ పోరుమామిళ్ల మండలం లోని రంగసముద్రం గ్రామ పంచాయితీ సర్వేనెంబర్ 1015 లో ఆర్ఎస్ఆర్ ప్రకారం సర్వేనెంబర్ 445 ఎకరాల 89 సెంట్లు కొండ పోరంబోకు భూమి ఉందని రికార్డులు చూపిస్తుందని ఆయన ఆరోపించారు. కానీ దీనిని స్వార్థపరులైన వెంగమాంబ విద్యాలయానికి సంబంధించిన యాజమాన్యం ఆక్రమించుకొని రెవెన్యూ వారిని తప్పుదోవ పట్టిస్తూ బయట వ్యక్తులకు విక్రయించారని ఆయన ఆరోపించారు. కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్కడ విద్యాలయాల నిర్మిస్తుంటే జిల్లా విద్యాశాఖ అధికారులు అనుమతి ఎలా ఇచ్చారని ఆయన అధికారులను ప్రశ్నించారు. వెంగమాంబ విద్యాలయ యాజమాన్యం సమాజా గౌరవం పాటించకుండా స్వార్థంతో ప్రవర్తించుచున్నారని ఆయన అన్నారు.రంగసముద్రం గ్రామ పంచాయతీకి సంబంధించి ఆర్ ఎస్ ఆర్ లో 1250 సర్వే నెంబర్ వరకు ఉన్నాయని. ఆ తర్వాత 1251 నుంచి 1015 సర్వే నెంబర్లలో  445 ఎకరాల 89 సెంట్లు నుంచి సబ్ డివిజన్లు కాబడినట్లుగా రంగసముద్రం గ్రామ రెవెన్యూ సూచిస్తుందని
ఇందులో 12 61/2 లో పచ్చ అంకమ్మ భర్త చిన్న వెంగయ్య ఖాతా నెంబర్ 480 లో 4 ఎకరాల 24 సెంట్లు డీకేటి పట్టా ఇచ్చినట్లుగా కంప్యూటర్ అడంగల్ చూపుతున్నదని ఆయన ఆరోపించారు. కానీ ఈ ప్రభుత్వ భూమిలేని నిరుపేదలకు పట్టాలు కల్పించి భూములు సాగు చేసుకుని వచ్చిన ఫల సాయంతో జీవనోపాధి చేసుకోవాలన్న ముఖ్య కారణంతో ప్రభుత్వం మంజూరు చేసిందని ఆయన ఆరోపించారు. కానీ సర్వేనెంబర్ 1261/2 లో వెంగమాంబ విద్యాలయం స్థాపించుకున్నారని. అదేవిధంగా ఈ కొండ పోరంబోకులో పొలంలో కోట్ల రూపాయలు విలువచేసే దాదాపు 20 పైగా పెద్ద భవనాలను నిర్మించాలని ఆయన ఆరోపించారు. వాటిని బయటి వ్యక్తులకు విక్రయాలు చేస్తూ వారు ఎనలేని ఆస్తులు సంపాదించుకున్నారని ఆయన అన్నారు.రియల్ ఎస్టేట్ రూపంలో స్థలాలు విక్రయాలు చేసి దాదాపు 100 కోట్లకు పైబడి బికేటి భూముల్లో సంపాదించుకున్నారని ఇందులో వెంగమాంబ పేరుతో విద్యాసంస్థలు పెట్టుకొని అక్రమంగా విద్యా వ్యాపారం చేస్తున్నారని ఆయన అన్నారు. వారి అక్రమ ఆస్తులపై మండల స్థాయి నుండి. జిల్లా కలెక్టర్ వరకు అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమ ఆస్తులు పెరిగి పోతున్నాయని ఆయన ఆరోపించారు.ఈ కొండ పోరంబోకు డీకేటి భూమిలో ఏకంగా వెంగమాంబ నగర్ అని నిర్మాణం చేశారన్నారు. అక్కడ వెంగమాంబ విద్యాలయం నిర్మించేందుకు వైయస్సార్ కడప డీఈవో ఎలా అనుమతులు ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.ఈ విద్యాలయం దగ్గర విద్యార్థి. విద్యార్థులకు జరగరాని సంఘటనలు జరిగితే ఎవరో దానికి బాధితులు వహిస్తారని ఆయన అన్నారు. సర్వేనెంబర్ 1261 లో  డీకేటి  భూమిలో నిర్మించిన ఈ విద్యాలయం భవనాలను. అక్కడ అక్రమంగా కట్టిన ఇళ్లను తొలగించి ఈ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రభుత్వ అవసరాలకు వినియోగించేలా  చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అదేవిధంగా ఈ సర్వే నెంబర్ లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ డికేటి స్థలములో నిర్మించిన వెంగమాంబ విద్యాలయం యాజమాన్యంపై. విద్యాలయానికి అనుమతి ఇచ్చిన జిల్లా విద్యాశాఖ అధికారులపై మండల విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా కలెక్టర్ ను కోరారు. అనంతరం పోరుమామిళ్ల తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి కి ఆయన వినతి పత్రాన్ని సమర్పించారు.

Post a Comment

0 Comments