google.com,pub-7984519998562318,DIRECT,f08c47fec0942fa0 రాష్ట్ర ముఖ్యమంత్రిని అవమానపరిచే వ్యాఖలు సహించేది లేదు.

రాష్ట్ర ముఖ్యమంత్రిని అవమానపరిచే వ్యాఖలు సహించేది లేదు.

న్యూస్ 21 తెలుగు ఛానల్: ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు పై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బి.కోడూరు మండలం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఓ. రామచంద్రా రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల మన్ననలు పొందిన నాయకుడిపై వ్యక్తిగత దూషణలు చేయడం రాజకీయ సంస్కృతికి విరుద్ధమని ఆయన అన్నారు.
రాజకీయాల్లో విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి గానీ, వ్యక్తిగత స్థాయికి దిగజారి మాట్లాడటం తగదని ఆయన స్పష్టం చేశారు. గతంలో కూడా అసెంబ్లీ వేదికగా చంద్రబాబు కుటుంబాన్ని అవమానించిన చరిత్ర అంబటి రాంబాబుదేనని గుర్తుచేశారు.
వైసీపీ చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజలను దృష్టి మళ్లించేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అత్యంత హేయమైన చర్య అని ఆయన మండిపడ్డారు. ప్రజలు ఇప్పటికే అలాంటి వైఖరికి గట్టి తీర్పు ఇచ్చారని, అయినా మార్పు రాకపోవడం దురదృష్టకరమని అన్నారు.
ముఖ్యమంత్రి పై అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయాల్లో పరస్పర గౌరవం, విలువలు పాటించాలని ఆయన సూచించారు.

Post a Comment

0 Comments