google.com,pub-7984519998562318,DIRECT,f08c47fec0942fa0 కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కు ఒరిగిందేమీ లేదు..పోతిరెడ్డి నాగార్జున రెడ్డి.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కు ఒరిగిందేమీ లేదు..పోతిరెడ్డి నాగార్జున రెడ్డి.

న్యూస్ 21 తెలుగు ఛానల్: పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారాం 9.వ సారి బడ్జెట్ ప్రవేశ పెట్టడం జరిగిందని. గత బడ్జెట్లో గాని. ఈ బడ్జెట్ లో గాని. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదని. రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ మాజీ సలహాదారులు పోతిరెడ్డి నాగర్జున రెడ్డి పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ డిఏ లో కీలక భాగస్వామిగా ఉంటూ. తెలుగుదేశం పార్టీ సహకారంతో నడుస్తున్న. కేంద్ర  ప్రభుత్వంలో రాష్ట్రానికి నిధులు సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. అమరావతికి గాని. పోలవరానికి గాని. విభజన హామీలలో.ప్రత్యేక నిధులు ఇవ్వవలసిన బడ్జెట్లో కేటాయించకుండా ఉండడం. కడప స్టీల్ ప్లాంట్. మరియు రాష్ట్రంలో కొత్తగా రైల్వే లైన్లో గాని. కొత్తగా రైళ్లు. ప్రవేశ పెట్టడం గాని లేదని ఆయన అన్నారు. ఇంతకుముందు భాకరాపేట నుండి గిద్దలూరు కి రైల్వేలైన్ ఏర్పాటు చేసే దానికి నిధులు మంజూరు చేయడం జరిగిందని. సర్వే కూడా జరిగిందని. నిధులు మాత్రం కేటాయించకపోవడం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ బడ్జెట్లో ఎంతో మేలు జరుగుతుందని .ఆశ పెట్టుకున్నారని ఆయన అన్నారు. ఇప్పుడు పూర్తిగా అన్యాయం జరిగిందని. ఈ బడ్జెట్ చూసిన మేధావులు. యువత.
ప్రజలు అందరూ బాధపడుతున్నారని. వ్యవసాయ రంగానికి పెద్దగా ఒరిగిందేమీ లేదని. టూరిజం. మెడికల్ కు కొంత బడ్జెట్ పెంచడం జరిగిందని. ఫార్మా రంగానికి కొంత ఊపు ఇవ్వడం జరిగిందన్నారు. రక్షణ రంగానికి భారీగా బడ్జెట్లో పెంచారు. ఎన్నారై లకు ప్రోత్సాహ కంగా 5 శాతం నుండి10. శాతానికి పెంచారని. నిత్యవసర వస్తువులు ధరలు తగ్గే విధంగా లేవని. పెట్రోలు. డీజిలు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిలు తగ్గినను. మనకు కేంద్రం నుండి తగ్గడం లేదని. సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయించింది ఏమీ లేదన్నారు.

Post a Comment

0 Comments