google.com,pub-7984519998562318,DIRECT,f08c47fec0942fa0 దళిత యువకుల మరణాలు ముమ్మాటికీ హత్యే.ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ.

దళిత యువకుల మరణాలు ముమ్మాటికీ హత్యే.ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ.

న్యూస్ 21 తెలుగు ఛానల్: వైయస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం లోని జోగుపల్లె తెలుగంగ కాలువ వద్ద ఈనెల 5వ తేదీ జరిగిన జోగుపల్లి గ్రామానికి చెందిన సతీష్ గుండాపురం గ్రామానికి చెందిన ఓబులేసులు మరణాలు అనేక అనుమానాలకు దారి తీసి అనేక మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై ఆదివారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ బ్రహ్మంగారిమఠం బ్రహ్మంగారిమఠం మండలం పర్యటించి మృతి చెందిన దళిత యువకుల గ్రామాలైన జోకుపల్లె గుండాపురం పర్యటించి మృతుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని నింపి అసలు మరణానికి గల కారణాలేంటి ఈ మరణం వెనుక నిజా నిజాలను స్వయంగా ఆయన తెలుసుకొని యువకులు మృతి చెందిన తెలుగంగ కాలువ వద్దకు స్వయంగా వెళ్లి నీటి ప్రవాహాన్ని ఆ కాలువ లోతును ఆయన స్వయంగా పరిశీలించారు అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ సతీష్ ఓబులేష్ మరణాల వెనుక ఎంతటి వ్యక్తులు ఉన్నా కూడా వదిలే ప్రసక్తే లేదని మీ కుటుంబాలకు అన్ని విధాలుగా ఈ మందకృష్ణ మాదిగ అండగా ఉంటాడని వారికి ధైర్యాన్ని చేకూర్చారు అనంతరం బ్రహ్మంగారిమఠంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో వారు మాట్లాడుతూ సతీష్ ఓబులేసుది ముమ్మాటికీ హత్య నని ఈ హత్య వెనుక తమకు అనేక అనుమానాలు ఉన్నాయని హత్యకు ప్రధాన కారణం సతీష్ కు నరసనపల్లి గ్రామానికి చెందిన ఒక యువతితో ప్రేమ వ్యవహారం ఉందని ఈ ప్రేమ వ్యవహారమే హత్యకు దారితీసిందని చాలా స్పష్టంగా అర్థమవుతుందని దానికి గల కారణాలు ఇటీవల కాలంలో సతీష్ ఆ అమ్మాయి ఇద్దరూ కొన్ని ప్రదేశాలలో రహస్యంగా కలుసుకున్న వీడియోలు వైరల్ అవుతున్నాయని వాటిని చూస్తే ఇది ముమ్మాటికీ హత్య అని సతీష్ ఆ యువతిని ప్రేమించినందుకు గాను వారి కుటుంబంలోని వ్యక్తులు ఇది తెలుసుకొని సతీష్ ను పరువు హత్య చేశారని సతీష్ ను చంపుతున్నటువంటి సందర్భంలో అతని స్నేహితుడైన ఓబులేసు పక్కనే ఉండగా సతీష్ ను చంపగా దాన్ని చూసిన ఓబులేసు ఎక్కడ విషయాన్ని బయటకి చెబుతాడో అనేటువంటి నేపథ్యంలో ఓబులేష్ ను కూడా అడ్డు తొలగించే కార్యక్రమాన్ని చేశారని దానికి ఎటువంటి సాక్ష్యం లేకుండా సాక్షాలన్నీ చెరిపి వేసే ప్రయత్నం చేశారని ఆ యువతి బంధువులు పోలీసులతో కుమ్మక్కై మొదట మృతి దేహం దొరికిన ఓబులేసు కుటుంబ సభ్యులతో తప్పుడు వాంగ్మూలం రాయించుకున్నారని సతీషు మృతదేహం దొరకకముందే సతీష్ కూడా మరణించాడనే వార్తను బయటికి ఎలా బయటపెట్టారని ఆయన ప్రశ్నించారు అంతేకాకుండా యువకులు మద్యం సేవించి కాలువలో పడారని తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి తీసుకెళ్లారని దీని వెనుక తమకు ఎస్సై పైన అనేక అనుమానాలు ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ హత్య వెనక ఎంతటి వ్యక్తులు ఉన్నా కానీ వారిని వదిలే ప్రసక్తే లేదని ఈ హత్య పైన ఎస్పీ ఆధ్వర్యంలో మైదుకూరు నియోజకవర్గానికి సంబంధంలేని ఇద్దరు డిఎస్పీ లను ఏర్పాటు చేసి ఒక సిట్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు అంతేకాకుండా ఈ కేసును ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత మంచిదని కేసు నిర్లక్ష్యం వహిస్తే ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు అంతేకాకుండా మైదుకూరు నియోజకవర్గానికి సంబంధించిన బహుజన ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ ఉండగా తన సొంత మండలం తన సొంత గ్రామానికి పక్కన ఉన్న యువకులు చనిపోతే ఎంతవరకు వారి కుటుంబాలను పరామర్శించలేదని ఆయన వెంటనే మృతుల కుటుంబాలను పరామర్శించి వారిలో ఆత్మస్థైర్యాన్ని నెలకొల్పి ఎస్పీ దృష్టికి వారు కూడా తీసుకెళ్లి కేసును వేగవంతం చేయాలని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు నాగరాజు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సురేష్ మాదిగ ఎం.ఎస్.పి రాష్ట్ర అధ్యక్షులు విశ్వనాధ్ మాదిగ, యం. ఎస్. పి జాతీయ నాయకులు నరేంద్ర మాదిగ,జిల్లా ఇంచార్జి ఈశ్వరయ్య, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు వెంకటేష్ మాదిగ, యం.ఎస్.పి జిల్లా అధ్యక్షులు రాజు, యం.ఈ.ఎఫ్ పిచికే బాబు, ఎర్రబెల్లి ఓబయ్య,ఎం ఈ ఎఫ్ రాష్ట్ర నాయకులు ఎంబడి ఈశ్వరయ్య, జోనఫ్,లక్కినేని బాబు,ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు జ్ఞానేశ్వర్ ఎంఈఎఫ్ మండల అధ్యక్షులు గురయ్యా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు నారాయణ,సంజీవ, వివిధ నియోజకవర్గాల ఎమ్మార్పీఎస్ నాయకులు ఎం ఈ ఎఫ్ ఎం ఎస్ పి నాయకులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments