ప్రధాని పదవికి వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ యూత్ రాష్ట్ర అధికార ప్రతినిధి అన్వర్ డిమాండ్.
న్యూస్ 21 తెలుగు: తెలుగు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతకాని విధానాలతో మధ్యప్రచ్యంలో జరుగుతున్న యుద్ధం కారణంగా గ్యాస్ సంక్షోభం దేశవ్యాప్తంగా ఉందని దీనికి బాధ్యత వహిస్తూ ప్రధాని తన పదవికి రాజీనామా చేయాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి అన్వర్ డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా గ్యాస్ సంక్షోభంలో ఉన్న పార్లమెంట్ సాక్షిగా పెట్రోలియం శాఖ మంత్రి అర్జిత్ సింగ్ పూరి ఎక్కడ కూడా గ్యాస్ సంక్షోభం లేదని, భారత దేశంలో గ్యాస్ సంపూర్ణంగా ఉందని చెప్పడం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క అపద్దాలకు పరాకాష్ట అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ సంక్షోభం లేకుంటే దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో క్యూలైన్లు కనబడుతున్నాయని బెంగళూరులో అనేక హోటల్లు గ్యాస్ లేక మూసి వేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం జరుగుతుంటే ఇజ్రాయిల్ కు వత్తాసు పలికి అనేక సంవత్సరాలుగా మన మిత్ర దేశమైన ఇరాన్ దూరం అవడం ఆ దేశ అధ్యక్షుడు చనిపోయిన అమెరికాకు తలోగ్గి కనీసం సోషల్ మీడియా వేదిక ద్వారానైనా కూడా సంతాపం ప్రకటించకపోవడం ఇలాంటి అనేక చర్యల వల్లే నేడు భారతదేశ నౌకలకు హార్మోస్ జల సంధి ద్వారా ప్రమేయం లేకుండా పోయిందని ఆయన గుర్తు చేశారు. నిన్న ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి భారత్ విషయంలో త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు తప్ప, ఖచ్చితంగా ఎలాంటి జవాబు ఇవ్వలేదు. ఇవన్నీ చూస్తుంటే మోడీ యొక్క విధానాల ద్వారా నేడు భారతదేశం గ్యాస్ సంక్షోభంలోకి నెట్టివేయబడిందని ఆయన మండిపడ్డారు. ఇకనైనా దేశవ్యాప్తంగా గ్యాస్ సంక్షోభం లేకుండా భారత్ కు కావాల్సినటువంటి గ్యాస్ సరఫరా సంపూర్ణంగా చేసే దిశగా కార్యచరణ రూపొందించాలని లేదంటే ప్రధానితో సహా మంత్రి మండలి మొత్తం రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన డిమాండ్ చేశారు.
0 Comments