న్యూస్ 21 తెలుగు: వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల మండలంలోని గురప్పగారిపల్లెలో బద్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పశుసంవర్థక శాఖ సహకారంతో ఉచిత పశువైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ ఉచిత పశు వైద్య శిబిరానికి బద్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ నారిశెట్టి సుప్రజ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బద్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ నారిశెట్టి సుప్రజ మాట్లాడుతూ బద్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వారి ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ శాఖ నిధులతో పశుసంవర్థశాఖ వారి సహకారంతో ఉచిత పశువైద్య శిబిరన్ని ఏర్పాటు చేసి పశువులకు చికిత్సలను చేయించి ఉచితంగా మందులను పంపిణి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య శాఖ డి.డి శ్రీనివాసులు రెడ్డి.ఏడి చంద్రశేఖర్. స్థానిక పశు వైద్య అధికారి బండి శ్రీనివాసులు రెడ్డి.మార్కెట్ యార్డ్ డైరెక్టర్ టీడీపీ సీనియర్ నాయకులు సెట్టెం ప్రతాప్.మార్కెట్ యార్డ్ సెక్రటరీ మురళి.గురప్ప స్వామి దేవస్థానం చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి.మండల టీడీపీ సీనియర్ నాయకులు పోరుమామిళ్ల చెరువు ఆయకట్టు మెంబెర్ తిరుమలశెట్టి సుబ్బారాయుడు తదితర నాయకులు. కార్యకర్తలు. సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.
0 Comments