న్యూస్ 21 తెలుగు: వైయస్సార్ కడప జిల్లా. కాశినాయన మండలంల. ఓబులాపురం గ్రామ సమీపంలోని సగిలేరు ఒడ్డున ఉన్న వివేకానంద వృద్ధాశ్రమంలో సోమవారం కవలకుంట్ల లూర్దయ్య, ధర్మపత్ని సంతోషమ్మ, కుటుంబ సభ్యులు వివేకానంద సేవాశ్రమంలో ఉన్న 35 మంది వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా కవలకుంట్ల లూర్దయ్య వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ అనాధలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. వివేకానంద సేవ శ్రమంలో మానసిక వికలాంగుల అనాధ ఆశ్రమంలో మతిస్థితి కోల్పోయిన 30 మంది అభాగ్యులు ఉన్నారు,స్వామి వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకొని రామకృష్ణ రెడ్డి దంపతులు అవ్వ తాతల కోసం మంచి ఆహ్లాదకరమైన ఆశ్రమాన్ని నిర్మించి వారిని కన్న బిడ్డలు లాగా పోషిస్తూ ఉండటం అభినందనీయమన్నారు.ఇలాంటి సేవా గుణం కలిగిన వ్యక్తులను ఎంతగానో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో కవలకుంట్ల లూర్ధయ్య,వారి సతీమణి కవలకుంట్ల సంతోషమ్మ, వారి కుమారులు జయచంద్ర,బుజ్జి బాబు, మధుబాబు,అరుణ, రాణి,సునీత,వేళాంగిణి,మరియమ్మ,సౌజన్య, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
0 Comments