google.com,pub-7984519998562318,DIRECT,f08c47fec0942fa0 బాబు జగజీవన్ రామ్ ను స్ఫూర్తిగా తీసుకోవాలి.

బాబు జగజీవన్ రామ్ ను స్ఫూర్తిగా తీసుకోవాలి.

న్యూస్ 21 తెలుగు: వైయస్సార్ కడప జిల్లా. కాశి నాయన మండలం లోని సావిసెట్టిపల్లె గ్రామంలో మాదిగ చర్మ,డప్పు కళాకారుల సంఘం మండల అధ్యక్షుడు మేక రవి ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మేక ప్రవీణ్, ప్రేమ్ లు మాట్లాడుతూ.. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నాం అంటే ఆయన చేసిన సేవలే నిదర్శనం అన్నారు. బలహీనవర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషిచేసిన దళిత ప్రజా నాయకుడు జగజీవన్ రామ్ అన్నారు. అలాంటి గొప్ప మహనీయుడు గురించి  నేటి తరాలకు అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశంలో ఉన్నత పదవులు చేపట్టి ప్రజా శ్రేయస్సు కోసం ఎందరినో ఎదిరించిన ఏకైక నాయకుడు అన్నారు. అలాంటి వ్యక్తి జయంతి వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్  సగిలి వర ప్రసాద్, గ్రామస్తులుఓబయ్య,శేఖర్, చంటి, పుల్లయ్య, సుకుమార్,  రాజేంద్ర,కిరణ్ జోజి, రాజమ్మ మరియ రోజమ్మ తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments