న్యూస్ 21 తెలుగు: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలో వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల మండలంలోని పోరుమామిళ్ల మేజర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ యనమల సుధాకర్ ను రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా యనమల సుధాకర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ  కోసం నిరంతరం కష్టపడిన వారిని గుర్తిస్తూ రాష్ట్ర పోలిట్ బ్యూరో కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని అందులో రాష్ట్ర కార్యనిర్వాహక  కార్యదర్శిగా నన్ను ఎన్నుకోవడం సంతోషంగా ఉందన్నారు. పార్టీ కోసం పార్టీ బలోపేతం కోసం  నా వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు, తెలుగుదేశం నాయకుల కు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.