google.com,pub-7984519998562318,DIRECT,f08c47fec0942fa0 రౌడీలు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆకతాయిలు తస్మాత్ జాగ్రత్త...

రౌడీలు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆకతాయిలు తస్మాత్ జాగ్రత్త...

రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్డే వార్నింగ్...

పలు కేసుల్లో నలుగురు ముద్దాయిలు అరెస్ట్...

న్యూస్ 21 తెలుగు: రౌడీలు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆకతాయిలు తస్మాత్ జాగ్రత్త అంటూ.రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్డే వార్నింగ్ ఇచ్చారు. శనివారం వైయస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ రకాల కేసుల్లో నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. వారిలో  ఒంటిమిట్టకు చెందిన ఈరి హర్ష వర్ధన్ ను కులం పేరుతో దూషించి, గాయపరచిన కేసులో కట్టా మల్లికార్జున, కట్టా బాలకృష్ణ, పూల కిరణ్ అరెస్ట్,పరారీలో మరో ఇద్దరు,నందలూరు మండలం గట్టుమీద పల్లిలో బెల్లం కొండయ్యను రాయి తో కొట్టి చంపిన కేసులో చిన్నయ్య అనే వ్యక్తి అరెస్ట్ చేసినట్లు ఎఎస్పీ తెలిపారు. తప్పు చేస్తే ఎంతటి వారినైనా సరే ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ
సమావేశంలో  ఒంటిమిట్ట సీఐ వెంకటేశ్వర్లు నందలూరు ఎస్సై మల్లికార్జున రెడ్డి, ఒంటిమిట్ట ఎస్సై శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు

Post a Comment

0 Comments