google.com,pub-7984519998562318,DIRECT,f08c47fec0942fa0 కల్లూరి దుగ్గి రెడ్డికి కొత్తకోట పిఎసిఎస్ చైర్మన్ పదవి నియామకం...

కల్లూరి దుగ్గి రెడ్డికి కొత్తకోట పిఎసిఎస్ చైర్మన్ పదవి నియామకం...

న్యూస్ 21 తెలుగు: వైయస్సార్ కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం. కలసపాడు మండలంలో ని  టిడిపి యువ నాయకుడు కల్లూరి దుగ్గిరెడ్డికి కొత్తకోట పిఎసిఎస్ చైర్మన్ పదవిని తెలుగుదేశం పార్టీ అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా కలసపాడు మండలంలోని కొత్తకోట పిఎసిఎస్ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిజమైన టిడిపి నాయకులకు పార్టీ గుర్తించిందని. నాకు ఈ చైర్మన్ పదవి రావడానికి కడప డీసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి. మరియు టిడిపి యువ నాయకుడు చెరుకూరి రవికుమార్. లు ఎంతో కృషి చేశారని. వారి కృషి ఫలితమే నాకు ఈ చైర్మన్ పదవి రావటానికి కారణమన్నారు. అందుకు ఆయన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం నన్ను నమ్మి ఈ చైర్మన్ పదవిని ఏర్పాటు చేశారని. అటువంటి ఈ పదవిని వమ్ము చేయకుండా పార్టీ బలోపేత కోసం కృషి చేస్తానని ఆయన అన్నారు. అదేవిధంగా నా పదవి కోసం పట్టుదలతో కృషి చేసి సహకరించిన బద్వేల్ తెలుగుదేశం పార్టీ నాయకులు డి సి సి బ్యాంకు చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి. బద్వేల్ టిడిపి యువ నాయకులు చెరుకూరి రవికుమార్. ల అడుగుజాడల్లో నడుచుకుంటూ వారు చెప్పిన విధంగా తెలుగుదేశం పార్టీకి కృషి చేస్తానని ఆయన అన్నారు.

 

Post a Comment

0 Comments