google.com,pub-7984519998562318,DIRECT,f08c47fec0942fa0 సామాజిక విప్లవ బాటలో దళిత హక్కుల పోరాట సమితి.

సామాజిక విప్లవ బాటలో దళిత హక్కుల పోరాట సమితి.

మతోన్మాద మనువాదులారా.! మానవ వాదులం ఏకమవుతున్నాం జాగ్రత్త.!

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర.

న్యూస్ 21 తెలుగు: దళిత హక్కుల పోరాట సమితి జిల్లా నాలుగో మహాసభలు వైయస్సార్ కడప జిల్లా బద్వేలు పట్టణంలోని గౌతమ్ కళాశాల ఆవరణంలో నిర్వహించడం జరిగింది. మొదటగా బద్వేల్ పట్టణంలోని నెల్లూరు రోడ్డు ఆర్ సి ఎం చర్చి నుండి ర్యాలీ నిర్వహించి అనంతరం గౌతమ్ జూనియర్ కళాశాల ఆవరణంలో బహిరంగ సభ దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు నాగ దాసరి ఇమ్మానుయేలు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ బహిరంగ సభకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ గాలి చంద్ర.ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ‌ దళిత హక్కుల పోరాట సమితి సామాజిక న్యాయం సమ సమాజమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నదని ఆ ధ్యేయంతోనే సమితి నిర్మాణం జరిగిందని.ఈనాడు భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ప్రజా వ్యతిరేక విధానాలు కొనసాగుతున్నాయని ముఖ్యంగా దళిత సమాజాన్ని ఒక ప్రణాళిక ప్రకారం మళ్లీ బానిసలుగా మార్చి వారి చెప్పు చేతుల్లో పెట్టుకోవాలననే దుర్మార్గపు ఆలోచనలతో పాలకులు ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.రాజ్యాంగాన్ని అనుసరించకుండా రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఆర్ఎస్ఎస్ బజరంగ్దళ్ విశ్వహిందూ పరిషత్ లాంటి మతోన్మాద మనువాద భావాజాలంతో ఈ దేశాన్ని మతదేశంగా మార్చాలనే కుట్ర జరుగుతున్నదని 
నైతికతకు నీళ్లు వదిలి మతవిద్వేశంతో కులవైషమ్యంతో మనుషుల మధ్య అనైక్యత సృష్టిస్తున్నారని ‌దీన్ని తిప్పి కొట్టకపోతే భవిష్యత్ అంధకారంలోకి నెట్టబడుతుందని ఆయన అన్నారు.భారతదేశాన్ని ఏలుతున్న ప్రధానమంత్రి భారతదేశం వెలిగిపోతోంది అంటూ ప్రగల్బాలు పలుకుతున్నారు ఎక్కడ భారతదేశం వెలుగుతుందో మాకైతే అర్థం కాని పరిస్థితి   మణిపూర్లో మహిళలను నగ్నంగా ఊరేగిస్తే 
ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బీహార్ లాంటి రాష్ట్రాలలో దళిత సమాజంపై దాడులకు పాల్పడి హింసించి ప్రాణాలు తీస్తుంటే నిలువునా ఇండ్లను కాల్చివేస్తుంటే కూల్చి వేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం వెనక ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు పేద ప్రజల శ్రమను దోచుకుంటున్న కార్పొరేటు పెద్దలకు గద్దలకు ఊడిగం చేసుకుంటూ బ్యాంకులకు ఎగనామం పెట్టి లక్షల కోట్లు దోచుకునే దొంగలకు వత్తాసు పలుకుతూ దేశంలోని ప్రభుత్వ సెక్టార్ లను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్తూ ఈ దేశాన్ని ఆదానీ అంబానీ ఆస్తి పెంపకానికి వనరుగా మార్చిన మోడీ గారు ఎక్కడ పేదవారికి న్యాయం చేశారని నిలదీశారు.దేశం అల్లకల్లోలం అవుతుంటే పేద ప్రజలు ఆకలి అంటరానితనంతో దుర్భరమైన జీవితాలను గడుపుతుంటే ఏనాడైనా వారిపై కన్నెత్తి చూసిన పాపన పోలేదన్నారు భారతదేశం సాక్షిగాఈభారతదేశానికిప్రతిష్టాత్మకమైనటువంటి రాష్ట్రపతి పదవిని అవమానం చేసినటువంటి వ్యక్తి మోడీ కాక ఇంకెవరు? మతోన్మాదులు హిందూ మతం పేరుతో తినే తిండి మీద కట్టే బట్ట మీద వేషం భాష నడక నడవడిక ఆహారపు అలవాట్లు పై ఆంక్షలు సంకెళ్లు విధించి దుర్మార్గంగా దళితుల ఇండ్లలో దూరి వారిని చిన్నచిన్న కారణాలకే వారిపై దాడులు చేసి చంపుతుంటే ఈ మేకింగ్ ఇండియా మాయగాడు 
ఏం చేస్తున్నట్టు అని ఆయన ప్రశ్నించారు. 
మహిళా బిల్లుపై రాజకీయ లబ్ధి పొందాలనుకుని 
డీ లిమిటేషన్ నుదాంట్లో చేర్చి దక్షణ భారతదేశానికి తీవ్ర మోసం చేయాలన్న ఆయన కుట్రను పార్లమెంటు సాక్షిగా భగ్నం చేయడం ప్రజా విజయంగా అభివర్ణించారు నిజంగా నైతిక విలువలు ఉంటే ప్రధాని తక్షణమే రాజీనామా చేయాలని కోరారు.బూటకపు మాటలతో కాలం వెలబుచ్చుతూ ప్రశ్నించే వారిని కవులను కళాకారులను అభ్యుదయ వాదులను భయభ్రాంతులకు గురిచేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ అర్బన్ నక్సలైట్లంటూ అసత్య విషప్రచారాలతో  దేశాన్ని సర్వనాశనం చేసింది ఎవరో త్వరలోనే ప్రజలు తేల్చుతారని అన్నారు
 పార్లమెంట్లో ఈ భారతదేశానికి హోంమినిస్టర్ గా వ్యవహరిస్తున్న అమిత్ షా నిండు సభలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానించడం ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. ఇలాంటి అహంకార పూరిత భావజాలాన్ని ప్రజలు తిప్పికొడతారని వారికి ప్రజలు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తారని హెచ్చరించారు. కోటి ఉద్యోగాలు అన్నావు నిరుద్యోగ భృతి అన్నావు నల్లధనాన్ని బయటకు తెస్తాను అన్నావు ఎక్కడ తెచ్చావు ఎవరికీ ఇచ్చావు జవాబు చెప్పాల్సిన అవసరం మోడీది అని అన్నారు.రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కారంటు డబ్బాలు కొట్టుకుంటున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేర్చారని ఆయన సూటిగా ప్రశ్నించారు.సంక్షేమ పథకాలు అంటూ కల్లబొల్లి మాటలు చెబుతూ పేపర్లలో తాటికాయ అంత అక్షరాలతో రాయించుకుంటూ
 పబ్బం గడుపుకుంటున్నారు తప్ప ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి లేనేలేదని ఆయన వాపోయారు నిజంగా ఈ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మీకు చిత్తశుద్ధి ఉంటే  దళితులపై జరిగే అన్యాయాలను దళితులపై జరిగే దాడులను ఏమాత్రం అరికట్టారో చెప్పాల్సిన బాధ్యత మీపై ఉందని ఆయన అన్నారు అటు జగన్మోహన్ రెడ్డి ఇటు నారా చంద్రబాబునాయుడు గారు పదవిలో ఉన్నంతకాలం దళితులపై జరిగే దాష్టీకాలు కొంచమైనా తగ్గినాయా అని ఒకసారి మీరు ఆత్మ విమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఆయన అన్నారు.ఓ దళిత సమాజమా దళిత బిడ్డలారా సామాజిక విప్లవమే ధ్యేయంగా సామాజిక న్యాయం కోసం దళిత హక్కుల పోరాట సమితి అహర్నిశలు పోరాటం చేస్తోంది ఇప్పుడు దళితులు ఏకమవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రస్తుత పరిస్థితులలో చెల్లాచెదురుగా పడి ఉంటే మనం బ్రతకడం కూడా కష్టమయ్యే పరిస్థితి దాపులుస్తోంది.
కడప జిల్లాకు సంబంధించి ఈరోజు నుండి దళితులపైఏ దాడులు జరిగినా దళితుల ప్రాణాలతో చెలగాటం ఆడినా మహిళల మానప్రాణాలకు ముప్పు వాటిల్లిన దళిత హక్కుల పోరాట సమితి చూస్తూ ఊరుకోదని ఈ దాడులకు పాల్పడే దుర్మార్గుల కు శిక్ష పడే వరకు పోరాటం కొనసాగిస్తుందని తెలియజేశారు ఎంతటి వాడినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని దళిత హక్కుల పోరాట సమితి దళితులుగా పిలవబడుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలకు అండగా నిలుస్తుందని వారి వెంట పోరాటాలకు సిద్ధమవుతుందని తెలియజేశారు
 దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి కానగల మునయ్య మాట్లాడుతూ మన హక్కుల కోసం మనం నిరంతరం పోరాడితేనే తప్ప మన హక్కులు సాధ్యం కావని ఆ హక్కులకై మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని ఏ ప్రభుత్వం వచ్చినా మనకు రావాల్సినటువంటి హక్కుల విషయంలోనూ అలాగే సంక్షేమ విషయంలోనూ సరైన పద్ధతులలో పోవడం లేదని అందుకు అనుగుణంగా వాటిని రాబట్టుకునేందుకు వాటిని సాధించుకునేందుకు మనం సమాయత్తం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు 
 ఈ కార్యక్రమంలో బద్వేలు నియోజకవర్గ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ పట్టణ కార్యదర్శి పెద్దులపల్లి బాల ఓబయ్య దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు పడిగే వెంకటరమణ కమలాపురం నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి నాగేశ్వరరావు బద్వేలు నియోజకవర్గ దళిత హక్కులపోరాట సమితి అధ్యక్ష కార్యదర్శులు పెంచలయ్య ప్రసాదు సిపిఐ మండల కార్యదర్శులు ప్రసాదు జాకోబు సునీలు పొంగూరు నాగరాజు మహిళా సంఘం నాయకురాలు విజయమ్మ విజయ కుమారి కృప సామాజిక చైతన్య సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు పునగాని చంద్రశేఖర్ సీనియర్ దళిత నాయకులు మరియు ఉపాధ్యాయులు నాగ దాసరి చెన్నరాయుడు ముస్లిం నాయకులు హాసన్ ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఇరుపక శ్రీనివాస్ వర్మ వెంకటయ్య డప్పు సుధాకర్ కార్యకర్తలు సుబ్బారెడ్డి వెంకటేశు సుధాకర్ డి హెచ్ పియస్ జమ్మలమడుగు నియోగ కార్యదర్శి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments