న్యూస్ 21 తెలుగు: వైయస్సార్ కడప జిల్లా. కలసపాడు మండలంలోని కొత్తకోట సింగిల్ విండో అధ్యక్షుడిగా కల్లూరు దుగ్గి రెడ్డి సొసైటీ కార్యాలయంలో బుధవారం సొసైటీ సీఈవో కొండా నారాయణరెడ్డి అధ్యక్షతన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ కల్లూరి దుగ్గి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మంత్రి నారా లోకేష్. డీసీసీ బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు కలసపాడు మండలంలో ని కొత్తకోట సొసైటీ బ్యాంకు చైర్మన్ గా నియమించారన్నారు.
కలసపాడు మండలంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని ఆయన తెలియజేశారు. ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు పడకుండా అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తానని ఆయన అన్నారు.
అదేవిధంగా నన్ను ఈ స్థాయిలో నిలబెట్టడానికి కారకులైనటువంటి నా మిత్రులు చంద్రగిరిప్రహల్లాద రెడ్డి ,చెరుకూరి రవికుమార్ వారి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మర్చిపోను అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చెరుకూరి చెనరాయుడు. నడిపి వెంకటసుబ్బయ్య. చిన్న వెంకటసుబ్బయ్య. జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షుడు పామూరి బాలిరెడ్డి. కలసపాడు మాజీ ఎంపిటిసి కడియం రామసుబ్బయ్య, తెల్లపాడు మాజీ సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు బక్కిరెడ్డి కొండారెడ్డి, నాగేశ్వరరావు, కలసపాడు మాజీ సర్పంచ్ మలిపెద్ది రాజా, సీనియర్ నాయకుడు గాజులపల్లె వెంకటరెడ్డి, లక్కాకుల రామ్మోహన్, పొట్టి పల్లి రమేష్, నాగేంద్ర. కలసపాడు మండల తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ముట్టే చెన్నయ్య, పుల్లారెడ్డి పల్లె కృష్ణారెడ్డి, కొండపేట ఉపాధ్యాయుడు కృష్ణారెడ్డి, కలసపాడు జిలాని. రాజుపాలెం శేఖర్ ,సొసైటీ మెంబర్ బత్తుల భద్రయ్య,కలసపాడు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
0 Comments