google.com,pub-7984519998562318,DIRECT,f08c47fec0942fa0 మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాష..మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఓట్లే గల్లంతయితే సామాన్యులకు దిక్కేది...

మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాష..మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఓట్లే గల్లంతయితే సామాన్యులకు దిక్కేది...

న్యూస్ 21 తెలుగు: నియోజకవర్గం నుండి రెండుసార్లు శాసనసభ్యులుగా ఉండి, డిప్యూటీ సీఎంగా పని చేసి, దాదాపు 35 ఏళ్లకు పైబడి కడప నగరంలో ఓటర్ గా ఉన్న అంజాద్ భాష.మైదుకూరు నియోజకవర్గం నుండి నాలుగు సార్లు శాసనసభ్యులుగా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా పనిచేసి, తమ స్వగ్రామం నక్కల దిన్నెలో 60 సంవత్సరాలకు పైబడి ఓటరుగా ఉన్న శెట్టిపల్లి రఘురామిరెడ్డి ల ఓట్లే తొలగిస్తే..గల్లంతయితే వైఎస్ఆర్సిపి సామాన్య ఓటర్లకు దిక్కెక్కడని. వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి.కమలాపురం నియోజకవర్గ పరిశీలకుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి నిశితంగా విమర్శించారు. వైయస్సార్ కడప జిల్లా. కడప నగరంలోని వైఎస్ఆర్సిపి జిల్లా కార్యాలయంలో బుధవారం సాయంత్రం రెడ్యం వెంకటసుబ్బారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ బి ఎల్ ఓ ల వద్ద ఉండాల్సిన కలర్ జిరాక్స్ ఓటర్ల జాబితా టిడిపి, కూటమి కి చెందిన బి ఎల్ ఎ వద్ద ఎలా ఉందని. ఆయన సూటిగా ప్రశ్నించారు. ఓటర్ల వ్యక్తిగత వివరాలను టిడిపి యాప్ లో నమోదు చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తపరిచారు. ఎస్ ఐ ఆర్ (సర్) ప్రక్రియలో భాగంగా టిడిపి, కూటమి పార్టీలకు చెందిన బి ఎల్ ఏ లు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించి, ఆ సమాచారాన్ని 'మై టిడిపి పాస్పోర్ట్'యాప్ లో నమోదు చేస్తూ ఫారం -7ను అధికారులకు సమర్పించి వైఎస్ఆర్సిపి అతి ముఖ్య నేతలను, మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన వివరించారు. ప్రతి బిఎల్ఎ తమ పరిధిలో కనీసం 50 నుండి 100 ఓట్లను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం పకడ్బందీగా వ్యూహం పన్నుతోందని ఆయన పేర్కొన్నారు. టిడిపి, కూటమి బిఎల్ఎ ల అక్రమాలను అడ్డుకోవాల్సిన బిఎల్ఓ లు వారికి పూర్తిగా సహకరించడంతోనే వైయస్ఆర్సీపీ ఓట్లను ఎదేచ్ఛగా తొలగిస్తున్నారన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను 2002 ఓటర్ల జాబితా ఆధారంగా నిర్వహిస్తున్నప్పుడు ఆ ఓటర్ల జాబితాను ఆన్లైన్ లో ఉంచకపోవడం ఎన్నికల కమిషన్ కూటమినేతలకు సహకరించడమేనని ఆయన ధ్వజమెత్తారు. ఇప్పటికైనా బిఎల్ఒ లు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అలాకాకుండా టిడిపి, కూటమినేతలకు సహకరిస్తే బీఎల్ఓ లపై కోర్టుల ద్వారా చర్యలు తప్పవని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. కూటమినేతలు తమ రెండేళ్ల పాలనకు సంబంధించి విజయోత్సవం ర్యాలీలో కూటమి ప్రభుత్వ విజయాలను ప్రచారం చేసుకోకుండా వైయస్ జగన్ పై అసందర్భ ప్రేలాపనలు చేయడం వారి నీచ రాజకీయానికి పరాకాష్ట అని రెడ్యం ఎద్దేవా చేశారు.

Post a Comment

0 Comments