విజయవాడలోని అక్కినేని నాగేశ్వరరావు ఆడిటోరియంలో జరిగిన మదర్ సర్వీస్ సొసైటీ మూడవ వార్షికోత్సవం సందర్భంగా వేరు వేరు రాష్ట్రాలలో స్వచ్ఛందంగా సేవ చేస్తున్నటువంటి వారికి అవార్డ్స్ అందించడం జరిగింది ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్, బి యస్ నారాయణరెడ్డి సంఘ సేవకులకు జాతీయ సేవా రత్న అవార్డ్ సినిమా హీరోయిన్ కుమారి రజిత షాండే మల్లాడి ప్రసాద్ చేతుల మీదుగా అందించారు. అనంతరం సంస్థ వ్యవస్థాపకులు మల్లాడి ప్రసాద్ మాట్లాడుతూ బి యస్ నారాయణరెడ్డి సంఘ సేవకులు స్వచ్ఛందంగా అనాధ శవాలకి అంత్యక్రియలు నిర్వహించటం మిగులు భోజనాలు పంపిణీ చేయడం చెట్లు నాటే కార్యక్రమాలు పేద పిల్లల విద్యకు సంబంధించినవి విద్యా సామాగ్రి అందిచడం అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆధ్యాత్మికంగా యోగా క్లాసులు చేపిస్తూ ప్రపంచ ఆధ్యాత్మిక గురువులు రవిశంకర్ గురూజీ దగ్గర శిష్యులుగా ఉండటం ఇంకా పలు రకాల సేవలు చేస్తున్నందుకు ఈ అవార్డ్ అందించినందుకు నాకు మా సంస్థ సభ్యులకు చాలా ఆనందంగా ఉందని ఎం ప్రసాద్ నారాయణరెడ్డిని కొని యాడారు. అవార్డ్ అందుకున్న నారాయణరెడ్డి మాట్లాడుతూ సంస్థ వ్యవస్థాపకులు మల్లాడి ప్రసాద్ కు నేను చేస్తున్న సేవలను గుర్తించి జాతీయ సేవా రత్న అవార్డ్ అందించినందుకు ఆయనకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ గిద్దలూరు బద్వేల్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆకృతి ఎస్ ఎస్ చైర్మన్ కటారు రమాదేవి భారతీయ జనతా పార్టీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు సుశీల రెడ్డి దాదాపు 150 కి పైగా ఎన్జీవో సంస్థల యజమానులు పాల్గొన్నారు.
0 Comments