అధికారుల నిర్లక్ష్యంతో ఇరుపయోగంగా మారిన 17 కోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్...సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర ప్రభుత్వంపై ధ్వజం...

అధికారుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారిన తెల్లపాడు ఎత్తిపోతల పథకంను మరమ్మత్తులు చేసి వారంలోగా చెరువులకు నీళ్లు అందించకపోతే సిపిఐ పక్షాన ఆందోళన ఉదృతం  చేస్తామని జిల్లా కార్యదర్శి గాలి చంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
సిపిఐ నాయకులు కార్యకర్తల తో రైతులతో కలిసి వైయస్సార్ కడప జిల్లా కలసపాడు మండలంలోని  తెల్లపాడు సమీపంలోని తెలుగు గంగ కాలువపై మరమ్మత్తులకు నోచుకోక నిరుపయోగంగా ఉన్న ఎత్తిపోతల పథకమును సందర్శించిన సందర్భంగా గాలి చంద్ర మాట్లాడుతూ,కడప జిల్లాలో మారుమూల ప్రాంతమైన కలసపాడు మండలంలోని తెల్లపాడు
 గ్రామపంచాయతీలోనితెల్లపాడు,ఎగువతంబళ్లపల్లె,ఎగువరామాపురం గ్రామపంచాయతీల పరిధిలోని తడుకు చెరువు,తిక్కమ్మ చెరువు, మేలకుంట చెరువు,రంపకుంట చెరువు, దూలవారిపల్లె చెరువు,కొండపేట కొత్తచెరువులకు నీటిని నింపడం కోసం  సుమారు 17 కోట్ల రూపాయల ప్రజాధనంతో చేపట్టిన ఎత్తిపోతల పథకం అధికారుల నిర్లక్ష్యం కారణంగా రెండు నెలల నుంచి నుంచి పనిచేయక చేయక కాలువనిండా నీళ్లు పోతున్న చెరువులలో మాత్రం చుక్కనీరు లేక రైతులు లబోదిబోమని నెత్తినోరు కొట్టుకుంటుంటే, మరమ్మత్తులు చేసి వినియోగంలోకి తేవాల్సిన ఇరిగేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు. సుమారు 15 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు,రైతు కూలీలకు సంబంధించినఅతిముఖ్యమైనతాగునీరు,సాగునీరు సమస్యనే పట్టించుకోకపోవడమే కాక, లిఫ్ట్ ఇరిగేషన్ కి వెళ్లే దారిపై ఉన్న కంప చెట్లను కూడా తొలగించకపోవడం అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిలువెత్తు నిదర్శనం అన్నారు. ఎత్తిపోతల పథకం నకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో పాటు, మోటారు మరమ్మత్తులకు గురై రెండు నెలలు కావస్తుంటే ఇరిగేషన్ అధికారులు కానీ,ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు కానీ ఏమాత్రం స్పందించకుండా తాత్సారం చేస్తే ఇక చెరువులకు నీళ్లు ఎప్పుడు అందిస్తారు?రైతులు ఎప్పుడు ఫైర్లు పెట్టుకుంటారు?ఈలోగా కాలువకు నీళ్లు నిలుపుదల చేస్తే ఈ సంవత్సరమంతా ఈ 15 గ్రామాల ప్రజలు కరువు కాటకాలతో తాగు, సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది.కావున ప్రజల అత్యవసరమైన ఈ సమస్యపై దృష్టి సారించి వెంటనే కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ స్థానంలో కొత్త
ట్రాన్స్ఫార్మర్ఏర్పాటుచేయడంతోపాటు,మరమ్మతులకుగురైనమోటార్లనుకూడారిపేరుచేసివెంటనేతడుకుచెరువు,తిక్కమ్మచెరువు,మేలకుంట చెరువు,రంపకుంట చెరువు, దూలంవారిపల్లె చెరువు, కొండపేట  కొత్తచెరువు తదితర చెరువులకు నీరు నింపి రైతులను,రైతు కూలీలను, పశు సంపదను  ఆదుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.అలా కాక ఈ విషయంపై ప్రభుత్వం,ఇరిగేషన్ అధికారులుస్పందించకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే మాత్రం రైతుల పక్షాన ఈ ప్రాంత ప్రజల పక్షాన, రైతు కూలీల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బాలు,రైతు సంఘం జిల్లా కార్యదర్శి భాస్కర్,ఏరియా సహాయ కార్యదర్శి పిడుగుమస్తాన్,మండలకార్యదర్శిసునీల్,ఏరియాకార్యవర్గసభ్యులువెంకటరమణ,రవికుమార్, కేశవ,నాగరాజు,నాగేష్,జి.ఎల్.నరసింహ,రవి,జాకోబ్, మండల నాయకులు రామాపురం భాష, రమణారెడ్డి మరియు అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు రైతులు రైతు కూలీలు మహిళలు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments