జాబ్ మేళా మీ జీవితంలో ఒక మలుపు...మీరు వేసే చిన్న అడుగులు రేపటికి గొప్ప విజయాలకు పునాది...నిరాశ చెందకుండా ముందుకు సాగండి... మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది...జాబ్ మేళా లో ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి...

వైయస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల: జాబు మేళ మీ జీవితంలో ఒక మలుపు. మీరు వేసే చిన్న అడుగులు రేపటికి గొప్ప పునాదులు అవుతాయని. నిరాశ చెందకుండా ముందుకు సాగాలని. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి పేర్కొన్నారు. పోరుమామిళ్ళ మండలంలో ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వైయస్సార్ ఈఎంసి కొప్పర్తి ఆధ్వర్యంలో సిపీ ప్లస్ ఎయిర్ డిక్షన్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ ద్వారా జాబ్ మేళాను నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ డి.సి. గోవిందరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి  నిరుద్యోగ యువతను ఉద్దేశించి మాట్లాడుతూ మీరు అందరూ ఇక్కడికి వచ్చి పాల్గొనడం మీ భవిష్యత్తుపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోందని. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉపాధి అవకాశాలు లభించాలన్నారు. ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రైవేట్ సంస్థలు కూడా ముందుకు రావడం చాలా సంతోషకరమని ఈ జాబ్ మేళా మీ జీవితంలో ఒక మలుపు కావొచ్చు. క్రమశిక్షణతో, నిబద్ధతతో పనిచేస్తే మీరు మంచి స్థాయికి చేరుకోగలరని ఆయన అన్నారు.అలాగే, మహిళలకు ఉచిత హాస్టల్, భోజనం వంటి సౌకర్యాలు కల్పించడం, పురుషులకు అదనంగా ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వడం వలన గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి దొరికే అవకాశాలు మరింతగా పెరిగాయని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
చివరగా ఎమ్మెల్సీ యువతను ఉత్సాహపరుస్తూ మీ కలలను పెద్దగా కనండి, వాటిని నెరవేర్చడానికి ధైర్యంగా ముందడుగు వేయండి. కష్టపడే మనస్తత్వం ఉంటే ఏదీ అసాధ్యం కాదు. ఈరోజు మీరు వేసే చిన్న అడుగులు రేపటి గొప్ప విజయాలకు పునాది వేస్తారని.నిరాశ చెందకుండా ముందుకు సాగాలన్నారు. అదేవిధంగా మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని ప్రోత్సాహకరమైన సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో పూత్తమణికంఠ రెడ్డి,రంగసముద్రం సర్పంచ్ చిత్తా రవి ప్రకాష్ రెడ్డి, కాశి నాయన మండలం కన్వీనర్ హనుమంత్ రెడ్డి, టేకురుపేట సర్పంచ్ కల్లూరు రమణారెడ్డి, జిల్లా ప్రచార విభాగ అధ్యక్షులు రాజీవ్ భాష, యూత్ లీడర్ చిత్తాగిరి ప్రణీత్ రెడ్డి, పెసల గణేష్. జిల్లా విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడు సాయి నారాయణరెడ్డి. నాగేల్ల, అనిల్ కుమార్ రెడ్డి, కోడూరు శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments