బ్రహ్మంగారి మఠం మండలంలో ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు సీసీ రోడ్డు పనులు వేగవంతం..

వైయస్సార్ కడప జిల్లా. మైదుకూరు నియోజకవర్గం లోని బ్రహ్మం గారి మఠం మండల పరిధిలోని రేకలకుంట పంచాయతీ చీకటివారిపల్లె నందు ఎమ్మెల్యే పుట్టాసుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు టీడీపీ మండల అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి సూచనలతో టీడీపీ మండల యువ నాయకులు కానాల మల్లి కార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను వేగవంతంగా ప్రారంభించారు.
దశాబ్దాలుగా తమ గ్రామంలో ఏ అభివృద్ధి పని జరగలేదని ఎమ్మెల్యే పుట్టాసుధాకర్ యాదవ్ చొరవతో తమ గ్రామం అభివృద్ధి చెందుతుండటంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు

Post a Comment

0 Comments