రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో నిర్మించిన, నిర్మాణంలో ఉన్న 17 వైద్య కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు కేటాయించకుండా ప్రభుత్వమే ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ జిల్లా స్టాండింగ్ కమిటీ మెంబర్ ఎస్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు
గురువారం స్థానిక భగత్ సింగ్ నగర్ ఆ పార్టీ కార్యాలయం నందు విద్యార్ధి యువజన కార్మిక సంఘాల సమావేశం నిర్వహించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పి పిపి లో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడానికి చంద్రబాబు సర్కారు రంగం సిద్ధం చేసిందని గత ప్రభుత్వం హయాంలో 8480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందేనని వీటిలో పది కళాశాలలను రెండు దశల్లో పి పిపి లో ప్రైవేటుకు అప్పజెప్పాలని బాబు సర్కారు నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమన్నారు ఈ నేపథ్యంలో తొలిదశలో పులివెందుల మార్కాపురం మదనపల్లె ఆదోని కళాశాలలకు వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఏపీఎంఎస్ ఐడీసీ టెండర్లు పిలవడం విరమించుకోవాలని వారు అన్నారు అదేవిధంగా పులివెందుల వైద్య కళాశాలను 47.58 ఎకరాల్లో 586 కోట్లతో గత ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది వైద్య కళాశాల బోధనాస్పత్రి నిర్మాణం కూడా గత ప్రభుత్వంలోనే పూర్తయింది సార్వత్రిక ఎన్నికలకు ముందే సీఎం హోదాలో కళాశాల బోధన ఆసుపత్రిని కూడా గత ప్రభుత్వం ప్రారంభించింది 50 ఎంబిబిఎస్ సీట్లతో గత విద్యా సంవత్సరంలోనే పులివెందుల కళాశాలల అక్కడమిక్ కార్యకలాపాలు ప్రారంభానికి ఎన్ ఎం సి అనుమతులు కూడా ఇచ్చింది అయితే కళాశాల మేం నిర్వహించలేమని కూటమి ప్రభుత్వం అనడం సిగ్గుచేటు అని అయితే ప్రైవేటు వ్యక్తులకు ఊడిగం చేయడం కోసమే కుట్రపూరితంగా మేము నిర్వహించలేమని లేఖ రాయడం రద్దు చేయడానికి అనుమతులు చేయడం సరికాదని అయితే మెడికల్ కళాశాలలో గత ప్రభుత్వం మొదలుపెట్టిన వాటిని పూర్తిచేసి విద్యార్థులకు వైద్య విద్యను అందించాల్సింది పోనిచ్చి మేము నిర్వహించలేము అని చెప్పడం ప్రభుత్వానికి సిగ్గుచేటని వారన్నారు ఏదైతే రాష్ట్రంలో ఉన్న మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం చేయడం విరమించుకోకపోతే సిపిఐ ఎంఎల్ లేబరేషన్, అనుబంధ సంస్థలైనటువంటి విద్యార్థి యుజన కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన తోపాటు ఉద్యమాల్ని కొనసాగించాల్సి వస్తుందని వారన్నారు కూటమి ప్రభుత్వానికి పేద విద్యార్థుల పైన ఆలోచన ఉంటే వైద్య విద్యను దూరం చేయరని అలా కాకుండా ప్రైవేట్ పరం చేస్తే కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వానికి పతనం తప్పదని వారన్నారు అదేవిధంగా చంద్రబాబు సర్కారు పిలిచే టెండర్లలో పాల్గొంటే పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే ద్రోహులుగా మిగిలిపోతారని వారు హెచ్చరిక చేశారు ఈ సమావేశంలో అఖిలభారత విద్యార్థి అసోసియేషన్ జిల్లా నాయకులు బి అనిల్ ఏరియానాయకులు శంకర్. చరణ్. బన్నీ. యువజన సంగం నాయకులు శివరాం. రవి. లు కార్మికసంగం. నాయకులు నారాయణ చంద్ర పాల్. విజయరావు. తదితరులు పాల్గొన్నారు
0 Comments