పోరుమామిళ్ల పట్టణంలో మరమ్మతు పనులకు నోచుకోని పంట కాలువలు
సూక్ష్మ నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వైయస్సార్ కడప జిల్లాలో 100 చెరువుల మరమ్మత్తులు మరియు కాలువల పూడిక తీసివేత కోసం 73 కోట్ల రూపాయలను నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది కానీ వైయస్సార్ కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్ల పెద్ద చెరువుకి ఎటువంటి ప్రయోజనం లేదని కాబట్టి ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని పోరుమామిళ్ల పెద్ద చెరువు నుంచి రంగసముద్రం చెరువుకు నీటిపారుదల సౌకర్యం కల్పిస్తున్న బెల్లగుడి కాలువను మరమత్తు పనులను చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి సభ్యులు పోరుమామిళ్ల మండల అధ్యక్షులు అన్వర్ కోరారు.పోరుమామిళ్ల పట్టణంలోని రంపాడు రోడ్డు సమీపం లో ఉన్న బెల్లగుడి కాలువను ఆయన పరిశీలించిన ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెనోవేషన్, రీస్టోరేషన్ పద్ధతిలో జిల్లాలో 100 చెరువుల మరమ్మత్తుల కోసం కేటాయించిన నిధులలో నుంచి కనీసం కొన్ని నిధులనైనా పోరుమామిళ్ల పెద్ద చెరువు కట్ట, లాకులు మరియు చెరువు నుంచి రంగసముద్రం చెరువుకు వెళ్లే బెల్లగుడి కాలువ మరమ్మత్తులు పై దృష్టి సాధించాలని ఆయన ఆయన అన్నారు. సుమారు 500 ఎకరాలకు నీరు అందిస్తున్న ఈ సూక్ష్మ తరహా నీటి వనరు అయినా ఈ చెరువులను సరైన మార్గంలో వినియోగించి రైతులకు రెండు పంటలు పండే విధంగా చేసి వాటి మరమ్మత్తులను ఈ నిధులలో నైనా కొంత మొత్తాన్ని కేటాయించి, కనీసం జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా నైనా పనులను పూర్తి చేసి రైతులకు నీరు అందేలా చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
0 Comments