వైఎస్ఆర్ కడప జిల్లా. పోరుమామిళ్ల మండలంలోని రంగసముద్రం గ్రామ పంచాయతీలో రోజురోజుకు భూ ఆక్రమణలు ఎక్కువ అయ్యాయి. భూ ఆక్రమణదారులతో వీఆర్వో కొమ్ము కాస్తున్నడంతో ప్రభుత్వ స్థలాలలో అడ్డు అదుపు లేకుండా అక్రమ కట్టడాలను నిర్మిస్తున్నారు. వివరాలకు వెళితే: పోరుమామిళ్ల మండలం. రంగసముద్రం పంచాయతీలోని నరసింగపల్లి దగ్గర కడప వయా విజయవాడకు వెళ్లే హైవే రోడ్డు సమీపంలో సర్వే నెంబర్ 6-22 లో 46 సెట్టు గుర్రాల బాట పేరుతో ప్రభుత్వ స్థలం ఉంది. ఈ స్థలములో అదే గ్రామానికి చెందిన అగ్రకులానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించుకొని అందులో బోరు డ్రిల్ వేసి విద్యుత్తు సౌకర్యం ఏర్పాటు చేసుకొని అక్రమంగా ఇంటి నిర్మాణ పనులు చేపడుతున్నారు.
కానీ పునాదులు నుండి గోడల వరకు నిర్మాణ పనులు చేపడుతుంటే రెవిన్యూ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించారు. ఆర్ అండ్ బి ప్రధాన రహదారి పక్కనే ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మాణ పనులు చేపడుతుంటే రెవెన్యూ అధికారులకు కనిపించడం లేదా. లేక అక్రమ దారునితో కుమ్మక్కయ్యారా అనే అంశంపై ప్రజల్లో పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ స్థలంలో బోర్ డ్రిల్ వేసి విద్యుత్ సౌకర్యం కల్పించారంటే రెవెన్యూ పాత్ర ఉండడంలో సందేహం లేదు. ఎందుకంటే రెవిన్యూ అధికారుల పనితీరు లోపంతో ఆక్రమణదారులకు అనుమతులు ఇచ్చేది వారే.. అక్రమ కట్టడాలను అడ్డుకునేది వారే. అందువల్ల ఆక్రమణదారులకు బోర్ డ్రిల్. మరియు విద్యుత్ సౌకర్యం కావాలంటే రెవెన్యూ అధికారులు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వవలసి ఉంది. రెవెన్యూ అధికారులు ఆక్రమణదారుని లాలూచీ పడడంతో భూ ఆక్రమణదారుని కి కావలసిన ప్రభుత్వ సదుపాయాలన్నీ సమకూర్చుకున్నారు. దీనికి కారణము సంబంధించిన విఆర్ఓ ఆక్రమణదారులతో కుమ్మక్కు కావడంతో పునాదుల నుండి గోడల వరకు నిర్మాణ పనులు వేగవంతంగా జరిగిపోతున్నాయి. మీడియా దృష్టికి వస్తే ఆ రోజుకు మాత్రమే తాత్కాలికంగా రెవెన్యూ అధికారులు అడ్డుకుంటున్నారు. తర్వాత యధావిధిగా పనులు సాగుతున్నాయి. సంబంధించిన విఆర్ఓ ఈ అక్రమ కట్టడాలపై సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకోకపోవడంతో నే ఇలా అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న విఆర్ఓ ఓబయ్య ముందుగా రంగసముద్రం పంచాయతీలో విధులను నిర్వహించారు. బదిలీలో భాగంగా మండలంలోని మరో పంచాయతీకి బదిలీపై వెళ్లారు. డబ్బు. రాజకీయ పలుకుబడి ఉపయోగించి రంగసముద్రం పంచాయతీకి వీఆర్వోగా బదిలీపై వచ్చారు. దీంతో గతంలో పనిచేసిన పరిచయాలు ఉండడంతో పంచాయతీలో భూ ఆక్రమణలు. అక్రమ కట్టడాలు ఆగడం లేదు. ఏది ఏమైనా జిల్లా ఉన్నతాధికారులు చొరవ తీసుకుంటే తప్ప లేకపోతే భూ దందాలు. ఆగే పరిస్థితి కనిపించలేదు.
అక్రమ కట్టడాల పై చర్యలు తీసుకుంటాను...
తహసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడి...
పోరుమామిళ్ల మండలంలోని రంగసముద్రం పంచాయతీలో అక్రమంగా నిర్మాణ పనులు చేపడితే చేపడితే వారిపై చర్యలు తీసుకుంటారని పోరుమామిళ్ల తహసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని పంచాయతీలో నరసింగపల్లి దగ్గర ప్రభుత్వానికి సంబంధించిన గుర్రాల బాట స్థలంలో కొందరు అక్రమంగా నిర్మాణ పనులు చేపడుతున్నది వాస్తవమేనని. ఈ పనులను జరగకుండా అడ్డుకున్నామని ఆయన అన్నారు. ఇలా మండలంలో అక్రమంగా నిర్మాణ పనులు చేపడితే వారిపై చర్యలు తీసుకుంటానని ఆయన వివరించారు.
0 Comments