వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల మండలంలోని వైయస్సార్ పార్టీ కార్యాలయం నందు బద్వేలు నియోజకవర్గం యువ నాయకులు మరియు రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్య రెడ్డి గారు పత్రిక ప్రకటన ద్వారా తెలియజేస్తూ కలసపాడు మండలం తెల్లపాడు గ్రామ పంచాయతీలో తెలుగుగంగ ఎడమ కాలువ నుండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వార నీటిని తరలించి తెలుగుగంగ కాలువ పై భాగాన ఉన్న తడుకువాగు చెరువు,తిక్కమ చెరువు,మేలకుంట చెరువు,దూలంవారిపల్లె చెరువు,తదితర ఏడు చెరువులు నింపి త్రాగు నీరు సాగునీరు సమస్య పరిష్కరించి కలసపాడు, కాశినాయన మండలాల్లోని అనేక గ్రామాల ప్రజలను రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని గత 20 సంవత్సరాలనుండి అనేక మార్లు, అధికారుల, రాజకీయ నాయకుల దృష్టికి తీసుక వెళ్లిననూ పరిష్కరించ లేని సమస్యను గత ప్రభుత్వంలో, కడప పార్లమెంట్ సభ్యులు,పెద్దలు మా ప్రియతమ నాయకులు వై యస్ అవినాష్ రెడ్డి, గారు, ఎమ్మెల్సీ డీసీ గోవింద రెడ్డి గారు, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ గార్లు,తదితర నాయకులు కలసిన ఒక వేదిక పై రైతులమంతా, మా సమస్యను వారి దృష్టికి తీసుక వెళ్లి న సుమారు 75రోజుల లోపల యుద్ధ ప్రాతిపదికన,సంబంధిత అధికారులచే, పనులు, 18 కోట్ల రూపాయలు,ప్రభుత్వ నిధులు మంజూరు చేయించి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వార మా చెరువులకు,ఎన్నికలకు ముందే, తెలుగుగంగ ఎడమ కాలువ నీరు చెరువులకు,విడుదల చేసి,త్రాగునీరు,సాగునీరు సమస్య నుండి,రైతులను,రైతుకూలలను,ఆదుకున్న ఘనత వై యస్ ఆర్ సీపీ పార్టీ నాయకులదే.కానీ పై సమస్య గురించి,ఏ నాడు పట్టించుకోని, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, నియోజకవర్గ నాయకులతో ఎన్నికల తర్వాత కొన్ని నెలలకు చాల అట్టాహాసంగా, రీ,ఓపెన్ చేసి పూలమాలలు వేసి సంకలు గుద్దుకొని సంతోష పడినారు. ఇటీవల సుమారు 25 రోజుల కిందట తెలుగుగంగ ఎడమ కాలువకు నీరు వదలినారు. ఇప్పటికి ఒక్క చుక్క నీరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వార వదలలేదు.మోటర్లు రిపేరి,ట్రాన్సుఫార్మర్ రిపేరి అని కాలయాపన చేస్తున్నారు,గత ప్రభుత్వం త్వరితగతిన పనులు పూర్తి చేయుటకు తన స్వంత పొలం ఇచ్చి సహకరించినందుకు అక్కడ వాచ్ మెన్ గా పనిచేస్తున్న ఒక పేద నిరుద్యోగ రైతు బిడ్డపై కక్ష కట్టి మీ రాజకీయ అధికార బలంతో అధికారులపై వత్తిడి తెచ్చి,అతనిని తొలగించిన మీ అధికార పలుకుబడి ఇప్పుడు ఏమైంది కేవలం కక్ష సాదింపుకు తప్ప, పేద ప్రజలకు, రైతులకు మీరు మీ నాయకులు ఉపయోగ పడరా.ఈరోజు రైతులు,ఎంత పెద్ద యెత్తున మొత్తుకున్నా మీకుచలనం రాదా.ఇప్పటికైన సంబంధిత అధికారులు. అధికార పార్టీల నాయకుల చొరవ చూపి చెరువులకు నీరు విడుదల చేయనిచో ప్రజలు రైతులు, రైతుకూలీల తరుపున వై యస్ ఆర్ సీ పి పోరాటాలు చేయాల్సి వస్తుందని హెచ్చరిక చేస్తున్నాం. అలాగే కాశీనాయన మండలంలో మొత్తం రూ.14 కోట్ల వ్యయంతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గత ప్రభుత్వంలో శాంక్షన్ చేయబడింది. అందులో రూ.11 కోట్లతో పనులు పూర్తిచేయగా, 2024 ఎన్నికల కారణంగా మిగిలిన రూ.3 కోట్ల పనులు ఆగిపోయాయి.ప్రస్తుతం అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వం మిగిలిన రూ.3 కోట్లను శాంక్షన్ చేసి పనులను పూర్తి చేస్తే, కాశీనాయన మండలంలోని సుమారు 5,000 ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వస్తుంది*
0 Comments