ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.ప్రభుత్వం గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలను అందించాలన్న ఉద్దేశంతో పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కళాశాల పనులను నిలిపివేసి పీపీపీ(పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ ) పద్ధతిలో కొనసాగించడానికి క్యాబినెట్ తీర్మానం చేయడం అన్యాయమన్నారు. ప్రైవేటీకరణతో పేదలకు వైద్యం అందే పరిస్థితి ఉండదని ప్రభుత్వమే వైద్య కళాశాలను నడపాలని డిమాండ్ చేశారు.
పీపీపీ విదానాన్ని రద్దు చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే వచ్చే అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చలో అసెంబ్లీ కి సిద్ధమవుతామని వారు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షులు జాలా సుమంత్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, అఖిలేష్, నాయకులు నవీన్, రాజు, రమణ, విద్యార్థులు పాల్గొన్నారు.
0 Comments