ఇంతవరకు కొత్త పెన్షన్లు ఇవ్వలేదనికాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీసీసీ సభ్యులు అన్వర్ ప్రభుత్వంపై ఫైర్...

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్న కొత్త పెన్షన్లను మంజూరు చేయకపోవడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీసీసీ సభ్యులు పోరుమామిళ్ల మండల అధ్యక్షులు అన్వర్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ డబ్బా కొట్టుకుంటున్న కూటమి ప్రభుత్వం, కొత్త పెన్షన్ల అమలులో వైఫల్యం చెందిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలం లోని రంగసముద్రం గ్రామపంచాయతీ పరిధి సుందరయ్య కాలనీలో నివాసముంటున్న ఖాదర్ బాషా( 35) కుటుంబాన్ని పరామర్శించిన ఆయన, ఈ యువకుడు లారీ క్లీనర్ గా పనిచేస్తు ప్రమాదవశాత్తు మూడు సంవత్సరాల క్రితం లారీ మీద నుంచి క్రిందపడి పక్షవాతం వచ్చి మంచానికే పరిమితమై నడవలేని స్థితిలో కాలం గడుపుతున్నాడు ఇతనికి భార్య,పిల్లలు కూడా ఉన్నారు సొంత ఇల్లు కూడా లేని ఇతను తన తల్లి వృద్ధాప్య పెన్షన్ పై జీవనం సాగిస్తున్నారు. ఇలాంటివారినైనా చూసి ప్రభుత్వం చలించకపోవడం, కొత్త పెన్షన్లు మంజూరు చేయకపోవడం చాలా దారుణం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బోగస్ పెన్షన్ ల ఏరివేత పై ఉన్న మక్కువ కొత్త పెన్షన్ల చేరివేతపై లేకపోవడం సిగ్గుచేటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసిపి ప్రభుత్వం చివరి రెండుసంవత్సరాల కాలం నుంచి, ఇప్పుడు అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్క కొత్త పెన్షన్ మంజూరు చేయకపోవడం దుర్మార్గమని ఆయన అన్నారు. పెంచిన నాలుగు వేల రూపాయల పెన్షన్ ని ప్రతినెలా చూపిస్తూ,భర్త చనిపోతే ఆ పెన్షన్ భార్యకిస్తూ (స్పౌస్ పెన్షన్)  సంబరపడుతున్న కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇప్పటివరకు మంజూరు చేయకపోవడం చాలా దారుణమని, ఇప్పుడైనా మేలుకొని ఇలాంటి వారికి ప్రభుత్వసాయం అందేలా కొత్త పెన్షన్లను మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు

Post a Comment

0 Comments