కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు “స్వస్థ నారి – సశక్తి పరివార్ అభ్యాన్” కార్యక్రమం ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు వైయస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని అన్ని సచివాలయాలలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సాదు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 18వ తేదీ గురువారం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, టేకురుపేట నందు మెగా మెడికల్ క్యాంప్ స్పెషలిస్ట్ డాక్టర్లచే నిర్వహిస్తున్నామన్నారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఆరోగ్యకరమైన స్త్రీలు – బలమైన కుటుంబాలు” అనే నినాదంతో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్భంగా ఈ మెగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ మేరీ ఎల్సా, డాక్టర్ శ్రీవిద్య, డాక్టర్ జయరాం, డాక్టర్ కరిష్మా పాల్గొంటారని ఆయన అన్నారు
0 Comments