వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్లలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న హిస్టరీ లెక్షరర్ పోస్టుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వనిస్తున్నట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.శ్యామ్యుల్ డేవిడ్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్థులు పీజీలో హిస్టరీ సబ్జక్టు నందు యాభై ఐదుశాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని, కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరని, అనుభవం మరియు నెట్, సెట్,
పిహెచ్డి ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడునని, ఉన్నత కళాశాల విద్యా శాఖ కమీషనరేట్ నిబంధనల ప్రకారం అర్హులైన వారు ఈ నెల 22 వ తేదీ ఉదయం 10 గంటల 30 నిముషములకు జరుగు ఇంటర్వూ మరియు డెమో క్లాసుకు బయోడెట మరియు అర్హత సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలతో నేరుగా హాజరు కావాలెనని, మరిన్ని వివరాలకు 8688191034 నంబరును సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు
0 Comments