ఉపాధ్యాయుల ఆర్థిక విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి...హామీలను గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం...యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ ప్రసాద్...

పోరుమామిళ్ల: ఉపాధ్యాయుల ఆర్థిక విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైయస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు రణభేరి కార్యక్రమంలో భాగంగా బైకు ర్యాలీ చేపట్టారు.
 ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ12 వ పి ఆర్ సి ని వెంటనే ప్రకటించాలని. ఉపాధ్యాయుల హెల్త్ కార్డులను అమలు చేయాలని. ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని. సిపిఎస్ రద్దు చేసి ఓ పి ఎస్ ను అమలు చేయాలని.4 డి ఎ ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందని ఆయన ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో  ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు.  ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణే తమ ధ్యేయమని, పేద, బడుగు, బలహీన వర్గాల వారికి నాణ్యమైన విద్యను అందజేస్తామని ప్రగాల్బాలు పలికి ఉద్యోగుల అండదండలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నదని ఆయన విమర్శించారు. ప్రపంచ బ్యాంకు, సాల్ట్ పథకం ఒప్పందం మేరకు సంస్కరణల పేరుతో ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రణాళికాబద్ధంగా ఉపాధ్యాయులను నిరంతరం బోధనేతర కార్యక్రమాలలో భాగస్వాములు చేస్తూ పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందకుండా చేస్తున్నారన్నారు. పాఠశాలల విలీనం పేరుతో వేలాది పాఠశాలను మూసివేసిన ప్రభుత్వం,  వేలాది పాఠశాలలను ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మార్చివేసిందని ఆయన ఆరోపించారు. ప్రతి ఏటా డీఎస్సీని నిర్వహిస్తామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం, ఉన్న బడులను మూసివేస్తుంటే ఉపాధ్యాయుల నియమకాలు ఎలా చేపడతారని వారు ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షపాతిగా ఉంటామని, ఉద్యోగులకు మెరుగైన వేతనాలను అమలు చేస్తామని హామీలు గుప్పించిన కూటమి ప్రభుత్వం కనీసం ఉద్యోగులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. పిఆర్సీ గడువు ముగిసి రెండేళ్లు అవుతున్నా పిఆర్సీ అమలుకు కనీస చర్యలు లేవన్నారు. వైసిపి ప్రభుత్వం హయాంలో నియమించిన 12వ పిఆర్సీ కమిషన్ చైర్మన్ డాక్టర్.మన్మోహన్ సింగ్ రాజీనామా చేసి ఏడాది దాటినా నూతన చైర్మన్ ను నియమించకపోవడం ఆంతర్యం ఏమిటన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు మాదన విజయకుమార్. జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్. జిల్లా కార్యదర్శి బుర్ర చెన్నయ్య. పోరమామిళ్ల మండల అధ్యక్ష. కార్యదర్శులు ఈశ్వరరావు. సత్యాన ఎస్.కె మహబూబ్బాషా. పిచ్చిరెడ్డి. కొండయ్య. ఎం సి గురయ్యా. బాలజోజి. సిఐటి యు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ భైరవ ప్రసాద్. తదితరు మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


    

Post a Comment

0 Comments