చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేట ఇంచార్జ్ ముఖేష్ ( అప్పు) ఆధ్వర్యంలో. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కుప్పం మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన కాణిపాకం వెంకటేష్ ను కుప్పం కొత్తపేట తెలుగుదేశం పార్టీ నాయకులు సాలువా కప్పి గజమాల వేసి ఘనంగా సన్మానించారు.
తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షులు కాణిపాకం వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తను గుర్తించి వారికి న్యాయం చేసే విధంగా పదవులు ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు.
తాను పార్టీ కోసం కష్టపడి పని చేసిన విషయానికి గుర్తించి తనుకు ఇంత పెద్ద బాధ్యతను ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనను నమ్మి ఇచ్చిన పదవికి బాధ్యతగా తీసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ తగిన సేవలను అందిస్తానని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో 15వ వార్డు పార్టీ అధ్యక్షులు సుకుమార్, ఉపాధ్యక్షులు హరినాథ్ గౌడ్, బూత్ కన్వీనర్లు కృష్ణ, అంజి,మురళి, లోకి,తాండవ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
0 Comments