వైయస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ నుండి ఒకవైపు మైదుకూరు రోడ్డు. మరోవైపు బద్వేల్ రోడ్డు పెద్ద గుంతల పడి రోడ్లు అధ్వానంగా ఉన్నాయని. వాటి పై అధికారులు గానీ. ప్రజా ప్రతినిధులు కానీ పట్టించుకోలేదని నేషనల్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర
సెక్రెటరీ ముత్యాల ప్రసాద్ రావు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాల ప్రభావంతో పోరుమామిళ్ల పట్టణంలో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన ఆరోపించారు. దెబ్బతిన్న రోడ్లు అధ్వానంగా ఉన్నప్పటికీ అధికారులు. మరియు నాయకులు పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు. రోడ్లు గుంతల పడి అధ్వానంగా ఉండడంతో వాహనదారులు. ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆయన అన్నారు. ద్విచక్ర వాహనదారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు. గుంతలు పడి అస్తవ్యస్తంగా ఉన్న ఈ రహదారిలో అధికారులు. ప్రజాప్రతినిధులు వెళుతుంటారు. కానీ ఈ రోడ్ల దుస్థితిపై వారికి కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. రోడ్ల దుస్థితి చాలా దారుణంగా ఉంటే వాటికి మరమ్మతు పనులు కూడా చేపట్టకపోవడం చాలా దారుణం అన్నారు.
ఒకవైపున వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపున రోడ్లు అధ్వానంగా మారాయి. కానీ ఏ ఒక్కరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్ల దుస్థితి పై ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
0 Comments