హైదరాబాద్ లోని పలుచోట్ల జరిగిన కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థి నాయకులు చేరాల వంశీ...

హైదరాబాద్ లోని విద్యానగర్లోని బీసీ భవన్ (ఆర్.కృష్ణయ్యగారి స్వగృహంలో) నిర్వహించిన బాపూజీ వర్ధంతి వేడుకల్లో పాల్గొనడం జరిగింది.
అనంతరం హైదరాబాదులోని ట్యాంక్ బండ్ వద్దగల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి నివాళులర్పించటం జరిగింది.
తదనంతరం ముషీరాబాద్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని బాపూజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన జాతీయ విద్యార్థి సమైక్య జెవిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేరాల వంశీ.
ఈ సందర్భంగా జాతీయ విద్యార్థి సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేరాల వంశీ మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ  స్వతంత్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారాని, అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తొలి దశ ఉద్యమంలోనూ అదే విధంగా మలిదశ ఉద్యమంలోనూ క్రియాశీలక పాత్ర పోషించి ప్రాణాలకు సైతం తెగించి కొట్లాడిన గొప్పవీరుడని అన్నారు. దళిత, బహుజనుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు అదేవిధంగా పోరాటాలు చేసిన గొప్ప వ్యక్తిని అలాంటి వ్యక్తి జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. ఇలాంటి గొప్ప మహనీయులను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు యువత అన్ని రంగాల్లో ముందుకు రావాలని సేవారంగంలో ముందుండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థుల నేతలు, బహుజన ఉద్యమకారులు, కొండా లక్ష్మణ్ బాపూజీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments