వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం కార్యవర్గ సమావేశం...

కడప జిల్లా. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎస్సీ విభాగం కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్ రెడ్డి.రాష్ట్ర ఎస్సీ విభాగం అధ్యక్షులు సుధాకర్ బాబు బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధ. రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్య రెడ్డి.మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాష.కడప జిల్లా ఎస్పీ విభాగం అధ్యక్షుడు వేంకటేశ్వరు. రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్య రెడ్డి. లు మాట్లాడుతూ
 మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దళితుల పక్షాన ఎల్లప్పుడూ నిలబడ్డారు. ఆయన పాలనలో దళితుల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు అమలు అయ్యాయి. గృహాలు, పింఛన్లు, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాల ద్వారా పేద దళిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకున్నారు. ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించి, వలంటీర్ స్థాయి నుండి హోమ్ మంత్రి స్థాయి వరకు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చిన ఘనత జగన్ గారిదే. ఒక దళితుడైన బాబురావును రాజ్యసభకు పంపిన గౌరవం, 200 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మించి దళిత సమాజానికి గౌరవం తీసుకువచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి. దేనని వారన్నారు.
డీబీటీ విధానం ద్వారా ఒక్క ఎస్సీ వర్గానికి 9,154 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించిన ఘటనం ఆయన దళితుల పట్ల చూపిన అంకితభావానికి ఉదాహరణ. జగనన్న కాలనీల ద్వారా సమానత్వాన్ని పెంపొందించి ప్రతి పేద కుటుంబానికి తలదాచుకునే ఇల్లు అందించారు.
 విద్యా రంగంలో తీసుకున్న సంస్కరణలు వేలాది మంది దళిత విద్యార్థులకు ఉన్నత విద్యను అందుకునే మార్గాన్ని సుగమం చేశాయి.ప్రస్తుత కూటమి ప్రభుత్వం, అయితే, దళితుల సంక్షేమాన్ని విస్మరించింది. 50 వేల ఎస్సీ పింఛన్లు తొలగించడం, రైతులకు యూరియా సరఫరా చేయలేకపోవడం, విద్యార్థులను, నిరుద్యోగులను అబద్ధపు హామీలతో మోసం చేస్తున్నారని ఇవి దళిత వ్యతిరేక చర్యలు. ప్రజా వ్యతిరేక పాలనపై మనమంతా ఒకటై చైతన్యం కలిగించాలి.దళితులు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసం మళ్లీ జగన్ మోహన్ రెడ్డి గారినే ముఖ్యమంత్రిగా చేయాల్సిన అవసరం ఉంది.
 సమాజంలో సమానత్వం, పేదల సంక్షేమం కొనసాగాలంటే జగనన్న పాలన తప్ప మరో మార్గం లేదు. అందరూ కలిసికట్టుగా ముందుకు వచ్చి, జగనన్న ప్రభుత్వాన్ని తిరిగి తెచ్చుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు.డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి.మాజీ సోషల్ వెల్ఫేర్ చైర్మన్ పులి సునీల్.బుసిపాటి కిషోర్. చిరుపాటి త్యాగరాజు.మాజీ అధ్యక్షుడు వినోద్. నగర ఎస్సీ అధ్యక్షుడు కంచుపతి బాబు. జిల్లా ప్రచార విభాగ అధ్యక్షులు రాజీవ్ భాషగారు. దళిత కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనారు.

Post a Comment

0 Comments