వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో శ్రీ రాఘవేంద్ర గ్రాండ్ నందు ప్రముఖ జ్యువెలర్స్ సంస్థ అయినటువంటి జోయాలుక్కాస్ వారు మూడు రోజుల పాటు బద్వేల్ ప్రాంత వాసుల కోసం ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ ఎగ్జిబిషన్ కు బద్వేల్ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంబించారు.
ఈ సందర్భంగా బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధా మాట్లాడుతూ జోయాలుక్కాస్ జ్యూవెలరీ సంస్థ గత ఎన్నో సంవత్సరాల నుండి నాణ్యమైన ఆభరణాలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందడం జరిగిందని ఆమె తెలిపారు.
ఇప్పటి వరకు 165 బ్రాంచ్ లు ఏర్పాటు చేసి దేశ వ్యాప్తంగా ఐ ఎస్ ఓ సర్టిఫై పొందిన నాణ్యమైన ఆభరణాలు కలిగిన సంస్థ అని తెలిపారు.
కాలానికి అనుగుణంగా ప్రజలకు కావలసిన రీతి లో వివిధ రకాలు డిజైన్స్ తో కూడిన ఆభరణాలు అందిస్తూ ప్రజల మన్నన పొందిందని తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే వివిధ రకాల ఆభరణాలు ఎగ్జిబిషన్ నందు పరిశీలించడం జరిగింది.అనంతరం నిర్వహకులు ఎమ్మెల్యే దాసరి సుధా ను సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో మాజీ కూడా చైర్మన్,రాష్ట్ర కార్యదర్శి శ్రీ గురుమోహన్,మున్సిపాలిటీ అధ్యక్షుడు శ్రీ సుందర రామిరెడ్డి,బూత్ కన్వీనర్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ యద్దారెడ్డి,అట్లూరు మండల పార్టీ అధ్యక్షుడు శ్రీ ప్రభాకర్ రెడ్డి,జిల్లా కార్యదర్శి శ్రీ పోలి రెడ్డి, శ్రీ నాగేశ్వర్ రావు, గోపవరం జె.సి.యస్ కన్వీనర్ శ్రీ పుల్లయ్య నాయకులు శ్రీ చెన్నకృష్ణా రెడ్డి,ఇతర ముఖ్యమైన నాయకులు పాల్గొన్నారు.
0 Comments