తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్...

కృష్ణానది సగం తెలంగాణకు ప్రాణదాయనిగా ఉంది. ఉమ్మడి ఏపీలో కృష్ణానది జలాల్లో తెలంగాణ వాటా కోసం పోరాటం చేశాం. 
ఉమ్మడి ఏపీలో కేసు వేస్తేనే స్టే వచ్చింది. 
ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచడానికి లక్షా 30వేల ఎకరాలు సేకరించడానికి  సిద్ధమైందన్నారు.5 మీటర్ల ఎత్తు పెంచి 100 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది. అదే జరిగితే కృష్ణా నదిలో తెలంగాణ ప్రాంతం వాళ్ళు క్రికెట్ ఆడుకోవడం తప్ప చేసేది ఏం లేదన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచాలని తీసుకున్న నిర్ణయంపై మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. 
మహారాష్ట్రలో రెండు జిల్లాలు మునుగుతాయని అక్కడి సీఎం స్పష్టంగా చెప్పారు. తెలంగాణ సీఎంకు మాత్రం మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న విషయం ఎందుకు తెలియటం లేదో? తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలు గమనించాలన్నారు.పాలమూరు పులిబిడ్డ రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు, కృష్టా నది ప్రాజెక్టులకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. 
కాంగ్రెస్.సుప్రీం సోనియాగాంధీతో కర్ణాటక సీఎం సిద్ద రామయ్యకు ఫోన్ చేపించి ఆల్మట్టి ఎత్తు పెంచడాన్ని ఆపాలి.హైదరాబాద్ లో కృష్ణా నది బోర్డు మీటింగ్ ఉంది. ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సీఎం పాల్గొని అల్మట్టికి వ్యతిరేకంగా వాదనలు వినిపించాలి. 
రేవంత్ రెడ్డి అవసరం లేని వాటికి సుప్రీంకోర్టుకు వెళ్తారు. ఈ విషయంలో ఏం చేస్తారో.గ్రూప్-1 విషయంలో అవసరం లేకపోయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం డివిజన్ బెంచికి వెళ్లింది.ఆల్మట్టిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లకపోతే జాగృతి తరపున మేము సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు.ఆల్మట్టి విషయంలో రేవంత్ రెడ్డి పాలమూరు పులినా? పేపర్ పులినా అనేది తేలుతుంది. బనకచర్లపై సుప్రీంకోర్టుకు వెళ్తామన్నట్లుగానే ఆల్మట్టిపై కూడా వెళ్తాం. గోదావరి నీళ్లను చంద్రబాబుకు రేవంత్ రెడ్డి అప్పగించారు.ఏపీ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఆదిత్య నాథ్ దాస్ ను తెలంగాణ ఇరిగేషన్ సలహాదారుగా పెట్టుకోవడంతోనే ఇబ్బందులు వస్తున్నాయి. ఆయనకు తెలంగాణ మీద ఎందుకు ప్రేమ ఉంటుంది. ఆ అధికారిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం.
ముఖ్యమంత్రి ఈ విషయంలో తెలంగాణ మీద ఉన్న ప్రేమను నిరూపించుకోవాలి.ఆల్మట్టి ఎత్తు పెంపు నిర్ణయం కాలేదని చెప్పటం అబద్దం. 
కర్ణాటక ప్రభుత్వం కేబినెట్ లో నిర్ణయం తీసుకొని రూ. 70 వేల కోట్లను కూడా దశల వారీగా విడుదల చేయనుంది. భూసేకరణకు కూడా ప్రణాళిక సిద్దం చేశారు. అయినా కూడా నిర్ణయం కాలేదని చెబుతున్నారంటే.మహబూబ్ నగర్ వాసులకు సీఎం ద్రోహం చేస్తున్నట్టే. బీసీల విషయంలో ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదు.  రిజర్వేషన్ల విషయాన్ని పట్టించుకోకపోతే జాగృతి ఆధ్వర్యంలో మంత్రులు, సీఎం ఇళ్లను ముట్టడిస్తాం. 
బీఆర్ఎస్ నుంచి వచ్చిన పదవి వద్దని స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామా చేశాను.
ఛైర్మన్ గారే డిలే చేస్తున్నారు. మళ్లీ రాజీనామా ఇవ్వమంటే ఇస్తాను. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. ఎంతమంది జై బీసీ అంటే అంత త్వరగా బీసీలకు న్యాయం జరుగుతుంది. 
పార్టీలో నాకు జరిగిన ఇబ్బందులపై సీఎం ఏమన్నారో నాకు తెలియదు. కానీ పార్టీలో నన్ను ఇబ్బందులు పెట్టారని తెలంగాణ ప్రజలకు తెలుసు. హరీష్ రావు మీడియా, బీఆర్ఎస్ సోషల్ మీడియా, సంతోష్ రావు సీక్రెట్ మీడియా నాపైన దాడి చేస్తున్నాయి. గత సంవత్సరం రాజకీయ కారణాలతో బతుకమ్మను జరుపుకోలేకపోయాం. ఇప్పుడు జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలకు హాజరు అవుతున్నాను. స్వంత ఊరు నుంచి ఆహ్వానం వచ్చింది కాబట్టే చింతమడకకు బతుకమ్మ ఉత్సవాలకు వెళ్తున్నా. నేను చింతమడకకు వెళ్లడాన్ని రాజకీయ కోణంలో చూస్తారని తెలుసు.  గత ప్రభుత్వం దసరాకు బతుకమ్మ పేరుతో చీరలు ఇచ్చింది.రేవంత్ రెడ్డి నేను సీఎం అయితే రెండు బతుకమ్మ చీరలు ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే బతుకమ్మ చీరలకు ఇందిరమ్మ పేరు పెట్టవద్దు బతుకమ్మ పేరునే కొనసాగించాలి.లేకపోతే తెలంగాణ ఆడబిడ్డ పేరు పెట్టాలి. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేశారు. దశలవారీగా పేర్లు మారుస్తూ.తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తున్నారు.

Post a Comment

0 Comments