వైయస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల: దీపావళి కానుకగా నవంబర్ నెల నుంచి ఒక డిఏను విడుదల చేయడం, 60 రోజుల్లో హెల్త్ కార్డుల వ్యవస్థను సక్రమంగా నడిపించేందుకు కమిటీని ఏర్పాటు చేసి ఇన్సూరెన్స్ విధానాన్ని పరిశీలించాలని ఆదేశించడం, ఆర్‌టీసీ ఉద్యోగుల ప్రమోషన్‌లపై వారం రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం పట్ల ఏపీ ఎన్జీవోస్ మరియు ఏపీ జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాస్ మీడియా. అధికారుల సంఘం. ఆరోగ్య వైద్య శాఖ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాదు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దీపావళి పండుగకు ముందే ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించడం, ముఖ్యమంత్రితో మరియు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌తో జరిగిన స్నేహపూర్వకమైన, గౌరవప్రదమైన, హుందాతన చర్చలు దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఈ స్థాయిలో జరగడం సంతోషదాయకమని వారు పేర్కొన్నారు.చైల్డ్ కేర్ లీవ్‌పై ముఖ్యమంత్రి చేసిన ప్రకటన మహిళా ఉద్యోగుల్లో ఆనందాన్ని నింపిందని తెలిపారు.హెల్త్ కార్డుల విషయంలో ప్యాకేజీ రేట్లు పెంచడం, జిల్లా ఆస్పత్రుల్లో చికిత్స పరిమితిని ₹50,000 నుండి ₹1,00,000కి పెంచడం, ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ నేరుగా ట్రస్ట్ ఖాతాలో జమయ్యేలా చూడటం, వైద్య సేవల సీలింగ్‌ను ₹2 లక్షల నుండి ₹5 లక్షల పైబడేలా పెంచడం, అలాగే ఆరోగ్యశ్రీ ఈ హెచ్ ఎస్ విధానాన్ని ఇన్సూరెన్స్ మోడల్‌గా మార్చే అవకాశాలను పరిశీలించాలని కమిటీకి ఆదేశించడం ఇవన్నీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ముఖ్యంగా పెన్షనర్లలో ఆనందాన్ని కలిగించే నిర్ణయాలుగా పేర్కొన్నారు.
ఉద్యోగ సంఘాలు, ఎన్‌జీవో హోమ్‌లను గతంలో మాదిరిగానే ప్రాపర్టీ టాక్స్ నుంచి మినహాయించడం, అలాగే చెల్లించవలసిన బకాయిలను రద్దు చేయడం కూడా హర్షణీయమని తెలిపారు.దీపావళికి ముందే ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేయాలని పట్టుబట్టి, ఆ సమావేశాన్ని సాధించగలిగిన ఏపీ జేఏసీ అధ్యక్షులు శ్రీ విద్యాసాగర్ గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ డి.వి. రమణ గారికి ఉద్యోగ సంఘాల తరఫున అభినందనలు తెలిపారు.
పిఆర్సి కమిటీ ఏర్పాటు విషయంలోనూ, 57వ మెమో ప్రకారం సుమారు 11,000 మంది ఉద్యోగులను ఓపిఎస్ ఓ పి ఎస్ పద్ధతిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించడాన్ని కూడా జేఏసీ హర్షించింది. మిగిలిన సమస్యలన్నింటినీ దశలవారీగా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.ఉద్యోగుల సమస్యల సాధనలో ఇది మొదటి అడుగు మాత్రమేనని, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, గ్రామ వార్డు సచివాలయాల నోషనల్ ఇంక్రిమెంట్లు ప్రమోషన్స్, గురుకుల పాఠశాలలో ప్రభుత్వ రంగ సంస్థల వయోపరిమితి 60 నుంచి 62 పెంచడం, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత మరియు ప్రభుత్వ పథకాలలో భాగస్వామ్యం చేయడం, మిగతా అన్ని అంశాల పరిష్కారం కోసం శ్రీ విద్యాసాగర్, శ్రీ రమణల నాయకత్వంలో ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ మరియు ఏపీ జేఏసీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారికి, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చీఫ్ సెక్రటరీ కే. విజయానంద్.ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, ఏ విద్యాసాగర్ గారు ప్రధాన కార్యదర్శి, డి. వి. రమణ,గారు, కడప జిల్లా అధ్యక్షులు జేఏసీ ఛైర్మెన్, బి. శ్రీనివాసులు , కార్యదర్శి, నిత్యపూజయ్య, మరియూ వారి కార్యవర్గ సభ్యుల పక్షాన, బద్వేల్ తాలూకా జేఏసీ పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
0 Comments