వైయస్సార్ కడప జిల్లా. మైదుకూరు నియోజకవర్గం దువ్వూరులో స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛందర స్వర్ణాంధ్ర కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరు తమవంతు కృషి చేయాలన్నారు. బయట చెత్తను మండించడం వంటి పనులు మరియు వాయి కాలుష్యాన్ని కలిగించే పనులను తగ్గించుకోవాలని సూచించారు. సైకిల్ మన ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా మన చుట్టుపక్కల వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తెలిపారు.వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో ప్రజలందరూ తమ వంతు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు*ఒక చెట్టు - ఒక జీవితం అనే నినాదంతో పచ్చదనం, పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు, విద్యార్థులకు ఆయన వివరించారు.శనివారం స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మరియు మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. లు
దువ్వూరు ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణంలోమొక్కలునాటారు.అనంతరం స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించి ఎంపీడీఓ ఆఫీస్ నుండి దువ్వూరు పట్టణం మూడు రోడ్ల కూడలి వరకు ర్యాలీగా వెళ్లి, మానవహారంగా ఏర్పడి ప్రజలతో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో డిపిఓ రాజ్యలక్ష్మి, మండల అధికారులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
0 Comments